Washroom : వాష్‌రూమ్‌లో స్మెల్ రాకుండా, టాయిలెట్ తెల్లగా మెరవాలంటే 1 చెంచా ఈ పొడి చాలు..
కాబట్టి ఇది మీ టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. టాయిలెట్ పాట్ బాగా మురికిగా ఉంటే..మీరు ఈ రెమెడీని రెండు మూడు రోజులు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే.. ఖచ్చితంగా మీ టాయిలెంట్ మెరుస్తుంది. దీన్ని చేయడానికి కేవలం 5 నిమిషాల సమయం పడుతుంది. ఇక మీ కష్టం తీరిపోయినట్టే. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇతర పౌడర్‌లు మీ టాయిలెట్ వాసనను మార్చేస్తాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 1 టీస్పూన్
టాయిలెట్ పాట్ శుభ్రం చేయడమంటే నిజంగా పెద్ద తలనొప్పి..ఈ పని వెరే ఎవరైనా చేస్తే బాగుండేది అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. వాస్తవానికి, టాయిలెట్ పాట్ శుభ్రంగా లేకుంటే, పరిశుభ్రత సమస్యలు తలెత్తటమే కాకుండా, బాత్రూంలో అపరిశుభ్రత వ్యాప్తి చెందుతుంది. టాయిలెట్ క్లీనింగ్ కోసం మార్కెట్లో వివిధ రకాల టాయిలెట్ క్లీనర్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ క్లీనర్‌లు మీ బాత్రూమ్‌కు నిజంగా మంచివని దీని అర్థం కాదు. ఘాటైన వాసనల కారణంగా చికాకు, ఇబ్బదిపడేవాళ్లు మనలో చాలా మంది ఉన్నారు. రకరకాల టాయిలెట్ క్లీనర్‌లను ఉపయోగించలంటే భయపడుతుంటారు. కానీ, ఎలాంటి ఇబ్బంది చికాకు లేకుండా ఒక్క స్పూన్ పౌడర్ తో టాయిలెట్ పాట్ ను ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ మనం తెలుసుకుందాం..
టాయిలెట్ పాట్‌లో ఏదైనా కెమికల్ క్లీనర్‌ని ఉపయోగించిన వెంటనే ఒక రకమైన ప్రతిచర్య జరగడం చాలా సార్లు చూస్తుంటాం..ముఖ్యంగా యాసిడ్ తో శుభ్రం చేసే క్రమంలో ఇలాంటి సమస్య వస్తుంది. టాయిలెట్ పాట్‌ను యాసిడ్‌తో శుభ్రపరచడం కూడా ప్రమాదకరం. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే.. కొన్ని టాయిలెట్ వాషింగ్ ట్రిక్‌లను ఉపయోగించడం ముఖ్యం. అది మీకు ఎలాంటి సమస్య లేకుండా మీ బాత్రూమ్‌ను శుభ్రం చేస్తుంది.
మీ టాయిలెట్ పాట్‌లో పసుపు రంగు మరకలు ఏర్పడినట్టయితే..మీరు వాటిని సరిగ్గా శుభ్రం చేయలేక పోతే, టాయిలెట్ పాట్‌లో ఒక స్పూన్ డిటర్జెంట్ పౌడర్‌ను చల్లండి. దాంతో మీరు మెరుపును చూస్తారు. ఇందుకోసం ముందు రోజు రాత్రి టాయిలెట్ పాట్ లో ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ వేస్తే చాలు. మీ బాత్‌రూమ్‌లోని పసుపు మరకలు ఉన్నచోట కాస్త ఎక్కువగా వేయండి.. రాత్రంతా ఇలాగే వదిలేయండి. ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే.. వాష్ రూమ్‌లో సర్ఫ్ చల్లిన తర్వాత దీని తర్వాత మీరు ఫ్లష్ చేయకూడదు. నీళ్లు కూడా చల్లకూడదని గుర్తుంచుకోండి.
ఇక మర్నాడు ఉదయం నిద్ర లేవగానే కొద్దిగా నీళ్లు పోసి బ్రష్ తో స్ర్కబ్ చేయాలి. అంతే, మీ పని పూర్తైనట్టే.. ఇక్కడ టాయిలెట్ పాట్ పసుపు రంగు పోయి మెరుస్తుండటం మీరు చూస్తారు. వాస్తవానికి, డిటర్జెంట్ పౌడర్ లైమ్‌స్కేల్, హార్డ్ వాటర్‌పై కూడా పని చేస్తుంది. కాబట్టి ఇది మీ టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. టాయిలెట్ పాట్ బాగా మురికిగా ఉంటే..మీరు ఈ రెమెడీని రెండు మూడు రోజులు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే.. ఖచ్చితంగా మీ టాయిలెంట్ మెరుస్తుంది. దీన్ని చేయడానికి కేవలం 5 నిమిషాల సమయం పడుతుంది. ఇక మీ కష్టం తీరిపోయినట్టే.
ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇతర పౌడర్‌లు మీ టాయిలెట్ వాసనను మార్చేస్తాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 1 టీస్పూన్ టాల్కమ్ పౌడర్‌ను టాయిలెట్‌లో చల్లండి. దీంతో కంపు వాసన పోతుంది. బాత్రూమ్ వాసనగా, టాయిలెట్ పాట్ మురికిగా మారినట్లయితే ఇలాంటి ట్రిక్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధంగా మీరు మీ టాయిలెట్ పాట్ వాసనను 1 గంటలోపే తొలగించేయవచ్చు. దీని కోసం మీరు పెద్దగా శ్రమపడాల్సిన పనిలేదు.. జస్ట్ వాష్ రూమ్‌లో టాల్కమ్ పౌడర్ చల్లితే చాలు.. 1 గంట తర్వాత సాధారణంగా ఫ్లష్ చేయండి. మీ టాయిలెట్ పాట్ వాసన ఆగిపోతుంది.
అలాగే, మీ టాయిలెట్ చాలా మురికిగా ఉంటే, మరో రకమైన క్లీనర్‌ని ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా టాయిలెట్ పాట్‌లో 2:1 నిష్పత్తిలో వైట్ వెనిగర్ నీటిని పోయాలి. అది పోసిన తర్వాత 1-2 స్పూన్ల డిష్ వాష్ లిక్విడ్ వేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. కొంచెం రియాక్షన్ ఉంటుంది. కానీ ఆ తర్వాత మీరు దానిని సులభంగా స్క్రబ్ చేయవచ్చు.
టాయిలెట్ పాట్‌లో బాగా మరకలు, మురికి, మచ్చలుగా ఉంటే..అరకప్పు వైట్ వెనిగర్‌లో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపి శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల టాయిలెట్ సులభంగా శుభ్రం అవుతుంది. పసుపు మరకలు పోకపోతే, ఉప్పు, వైట్ వెనిగర్ మిశ్రమాన్ని తయారు చేసి, రాత్రిపూట టాయిలెట్లో చల్లాలి. ఉదయానికి అంతా శుభ్రంగా మారుతుంది. ఇలా చేయటం వల్ల మీరు పెద్దగా శ్రమపడాల్సిన పని తప్పుతుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..