Amitabh Kant: దేశంలో విక్రయించే ప్రతి మొబైల్ హ్యాండ్‌సెట్ భారతలోనే తయారీః అమితాబ్ కాంత్
బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతీయ మార్కెట్ ఎదుగుతోందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక రంగాలల్లో అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ఈ ఏడాది అంటే 2023లో భారత మార్కెట్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో దాదాపు 100 శాతం మేడ్ ఇన్ ఇండియావేనని వెల్లడించారు. కాగా, గతేడాది ఈ సంఖ్య 98 శాతంగా ఉందన్నారు
బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతీయ మార్కెట్ ఎదుగుతోందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక రంగాలల్లో అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ఈ ఏడాది అంటే 2023లో భారత మార్కెట్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో దాదాపు 100 శాతం మేడ్ ఇన్ ఇండియావేనని వెల్లడించారు. కాగా, గతేడాది ఈ సంఖ్య 98 శాతంగా ఉందన్నారు. మొబైల్ తయారీ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మధ్య రాజకీయ పోరు జరుగుతున్న తరుణంలో కాంత్ ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జి-20 సమ్మిట్‌లో అమితాబ్ కాంత్ పాల్గొన్నారు. ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్ అండ్ ది రైజ్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ అనే అంశంపై జరిగిన సదస్సులో భారత జి-20 షెర్పా కాంత్ ప్రసంగించారు. అనంతరం సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్ట్‌లో, 2014లో భారతదేశ మొబైల్ హ్యాండ్‌సెట్ డిమాండ్‌లో దాదాపు 81 శాతం చైనా దిగుమతుల ద్వారా వచ్చేదని చెప్పారు. కానీ నేడు పరిస్థితి మారిందన్న ఆయన, ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఎదిగిందన్నారు.
2014-2022లో భారతదేశంలో 2 బిలియన్లకు పైగా మొబైల్ హ్యాండ్‌సెట్‌లు తయారు చేయడం జరిగింది. 2023 నాటికి భారతదేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ సంఖ్య 27 కోట్లు దాటుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో తయారయ్యే మొబైల్ హ్యాండ్‌సెట్‌లలో 20 శాతం ఎగుమతి అవుతున్నాయని ఆయన తన పోస్ట్‌లో తెలిపారు. 2014 నుండి 2022 మధ్య కాలంలో, దేశంలో మొబైల్ తయారీ 23 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరిగిందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…