Astro Tips: ఈ 4 రాశుల వారు అవకాశం బట్టి సంబంధం విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడతారు.. ఆ రాశులేమిటంటే..

జ్యోతిషశాస్త్రం కొన్ని సూచనలను చేసినప్పటికీ వ్యక్తిగత అనుభవాలు మారవచ్చని గమనించడం ముఖ్యం.. విశ్వాసాన్ని పెంపొందించు కోవడానికి కొన్న చర్యలు తప్పవని సూచించింది. ఏది ఏమైనా ఆరోగ్యకరమైన సంబంధానికి నమ్మకం  మూలస్తంభం.. అయితే ఆ నమ్మకాన్ని కొనసాగించడం కొన్ని జంటలకు సవాళ్లగా మారుతుంది. ఈ నాలుగు రాశుల వారు సంబంధం విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడతారు.. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.. 

Astro Tips: ఈ 4 రాశుల వారు అవకాశం బట్టి సంబంధం విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడతారు.. ఆ రాశులేమిటంటే..
Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Nov 16, 2023 | 7:03 AM

ఏ బంధానికైనా నమ్మకం ముఖ్యం.. నమ్మకం లేని బంధం ఎప్పుడు నిలబడదని పెద్దలు చెబుతారు. అయితే సంబంధంలోని నమ్మకాన్ని వమ్ము చేస్తూ… ద్రోహం చేసే లక్షణాలు ఉన్న కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల నేచర్ అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. అటువంటి వ్యక్తుల గురించి జ్యోతిషశాస్త్రం కొన్ని సూచనలను చేసినప్పటికీ వ్యక్తిగత అనుభవాలు మారవచ్చని గమనించడం ముఖ్యం.. విశ్వాసాన్ని పెంపొందించు కోవడానికి కొన్న చర్యలు తప్పవని సూచించింది. ఏది ఏమైనా ఆరోగ్యకరమైన సంబంధానికి నమ్మకం  మూలస్తంభం.. అయితే ఆ నమ్మకాన్ని కొనసాగించడం కొన్ని జంటలకు సవాళ్లగా మారుతుంది. ఈ నాలుగు రాశుల వారు సంబంధం విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడతారు.. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మిథున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ద్వంద్వ స్వభావానికి ప్రసిద్ధి చెందిన వారు. కొన్నిసార్లు వీరి చర్యలు , నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. తరచుగా నిర్ణయాలను మారుస్తూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం వీరు భాగస్వాములకు అర్ధం చేసుకోవడం కష్టంగా నిలుస్తుంది. అంతేకాదు ఈ రాశికి చెందిన వ్యక్తుల ఉద్దేశాలను భాగస్వాములు ఊహించడం సవాలుగా నిలుస్తాయి. దీంతో వీరు తమకు ద్రోహం చేస్తున్నారనే భావన అవతలివారికి కలుగుతుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు తీవ్రమైన ఆలోచనా ధోరణి, భిన్నమైన అభిరుచికి ప్రసిద్ధి చెందినప్పటికీ.. తమ భావాలు ఎదుటివారికి తెలియకుండా రహస్యంగా ఉంటారు. వీరి గురించి పొరపాటున లేదా తప్పుగా అవతలివారు అర్థం చేసుకున్నట్లయితే  తమకు చెందిన విషయాలను రహస్యంగా ఉంచే విధంగా లేదా తారుమారు చేస్తారు. దీంతో వీరు తమ భాగస్వామి నమ్మకాన్నివమ్ము చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: ఈ రాశివారు ఎల్లప్పుడూ కొత్త అనుభవాలను కోరుకునే సాహసికులు. వీరి ప్రేమ కొన్నిసార్లు తక్కువ నిబద్ధతని కలిగి ఉంటుంది. సంబంధంలో స్పష్టమైన సరిహద్దులు, అంచనాలను ఏర్పరచడంలో కీలకమైనదిగా మారుతుంది.

మీన రాశి: ఈ రాశివారు చాలా సున్నితత్వం, భావోద్వేగాలు కలిగి ఉంటారు. కాబట్టి సమస్యలను ధీటుగా ఎదుర్కోవడం సవాలుగా మారుతుంది. బదులుగా వీరు పరోక్ష పద్ధతులు లేదా ఎగవేసే నేచర్ ని కలిగి ఉంటారు. ఉద్దేశపూర్వకంగా తమ సంబంధాల విషయంలో నమ్మకాన్ని పోగొట్టేలా సమస్యలను సృష్టిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు