Diwali 2023: దేశంలో ఈ దేవాలయాల్లో వైభవంగా దీపావళి వేడుకలు.. భక్తులకు ప్రసాదంగా నగలు, డబ్బులు

దీపావళి రోజున హిందువులు తమ ఇంటిలో పూజలు చేయడమే కాదు.. దేవాలయాలను కూడా సందర్శిస్తారు. దీపావళి రోజున దేశంలోని ఏ దేవాలయాలను దర్శించుకోవడానికి దేవుని ఆశీర్వాదం కోసం వెళ్తారో తెలుసుకుందాం.. దీపావళి నాడు అయోధ్య నగరం పెళ్లికూతురులా ముస్తాబైంది. యూపీలోని అయోధ్య రాముడి జన్మస్థలం కూడా. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే దీపావళి వేడుకలు చూడడానికి రెండు కళ్లు చాలవు. ఓ  అద్భుతమైన దృశ్యంలా అనిపిస్తుంది. రామ్ లల్లా దర్శనంతో పాటు, సరయూ నదికి కూడా వెళ్ళవచ్చు.

Diwali 2023: దేశంలో ఈ దేవాలయాల్లో వైభవంగా దీపావళి వేడుకలు.. భక్తులకు ప్రసాదంగా నగలు, డబ్బులు
Diwali Fest In Temples
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2023 | 1:06 PM

దేశవ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున వచ్చే ఈ పండుగ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవి, గణపతి, కుబేరుడిని పూజిస్తారు. నిర్మలమైన హృదయంతో నియమ నిష్టలతో లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తే భక్తులు కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. అయితే, దీపావళి రోజున హిందువులు తమ ఇంటిలో పూజలు చేయడమే కాదు.. దేవాలయాలను కూడా సందర్శిస్తారు. దీపావళి రోజున దేశంలోని ఏ దేవాలయాలను దర్శించుకోవడానికి దేవుని ఆశీర్వాదం కోసం వెళ్తారో తెలుసుకుందాం..

అయోధ్య: దీపావళి నాడు అయోధ్య నగరం పెళ్లికూతురులా ముస్తాబైంది. యూపీలోని అయోధ్య రాముడి జన్మస్థలం కూడా. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే దీపావళి వేడుకలు చూడడానికి రెండు కళ్లు చాలవు. ఓ  అద్భుతమైన దృశ్యంలా అనిపిస్తుంది. రామ్ లల్లా దర్శనంతో పాటు, సరయూ నదికి కూడా వెళ్ళవచ్చు.

మహాలక్ష్మి దేవాలయం, రత్లం: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో ప్రసిద్ధ మహాలక్ష్మి ఆలయం ఉంది. సంవత్సరం పొడవునా.. ముఖ్యంగా దీపావళిరోజున భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ధన్‌తేరస్ నుండి దీపావళి వరకు అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఆభరణాలను సమర్పిస్తారు. విశేషమేమిటంటే దీపావళి రోజున ఈ ఆలయానికి వచ్చిన ఏ భక్తుడు ఖాళీ చేతులతో తిరిగి రాడు. దీపావళి సందర్భంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన నగలను, ఆభరణాలను ప్రసాదంగా భక్తులందరికీ పంచుతారు.

ఇవి కూడా చదవండి

ఝండేవాలన్ ఆలయం: రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న సిద్ధపీఠం. ఝండేవాలన్ దేవాలయం ఒక పురాతన దేవాలయం. ఈ ఆలయం కరోల్ బాగ్‌లోని ఝండేవాలన్ రోడ్‌లో ఉంది. దీపావళి రోజున ఈ  ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ఇక్కడ దీపావళి రోజున భారీ సంఖ్యలో చేరుకుంటారు.

బృందావనం: ధన్‌తేరాస్ నుంచి అన్న చెల్లల పండగ వరకూ మధుర, బృందావనానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. తమ ఆరాధ్యదైవమైన బాంకే బిహారీని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. ఢిల్లీ నుండి రైలు, బస్సు లేదా ప్రైవేట్ వాహనంలో దర్శనం కోసం ఇక్కడకు చేరుకోవచ్చు.

కాశీ విశ్వనాథ ఆలయం: ప్రపంచంలో అతి పురాతన ఆధ్యాత్మిక నగరం వానరాశి. కాశీ నగరం శంకరుని త్రిశూలం కొనపై ఉందని  విశ్వాసం. ఇక్కడ జరిగే దీపావళి వేడుకలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. దీపావళి రోజున కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి ప్రజలు ప్రత్యేకంగా వస్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!