ప్రపంచంలో తొలి దీపం వెలిగింది పాకిస్తాన్ లోని ఆ ప్రదేశంలోనేనా! బాణసంచా ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?

దీపాల పండుగ హిందూ గ్రంధమైన స్కాంద పురాణం, అగ్నిపురాణంలో ప్రస్తావించబడింది. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం నుంచి దీపావళి జరుపుకుంటున్నారని నమ్ముతారు. అనంతరం దీపావళిని ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకోవడం మొదలు పెట్టారు. దీపావళిని జరుపుకునే సంప్రదాయం 5000 సంవత్సరాల నాటిదని నమ్మకం. స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యంలో శ్రీ కృష్ణుడు దీపాలను వెలిగించడం సూర్యుని పూజించడంలో ఒక భాగమని వర్ణించాడు.

ప్రపంచంలో తొలి దీపం వెలిగింది పాకిస్తాన్ లోని ఆ ప్రదేశంలోనేనా!  బాణసంచా ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?
Diwali 2023
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2023 | 12:36 PM

హిందువుల ప్రముఖ పండగల్లో ఒకటి దీపావళి. దేశ విదేశాల్లో ఉన్న హిందువులు దీపావళి పర్వదినాన్ని  ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు (నవంబర్ 12) దీపావళిని పిల్లలు, పెద్దలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే నవంబర్ 11న అయోధ్యలో ఛోటీ దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. దీపావళి రోజున సాయంత్రం ఇంట్లో, వ్యాపార సంస్థల్లో లక్ష్మీదేవి, గణపతిలకు పూజ చేస్తారు. అంతేకాదు ఇల్లు, ఆలయాలు, ఆఫీసు వంటి ప్రాంతాలను రంగురంగుల లైట్లతో అలంకరిస్తారు. ఇంటి ముందు ప్రమిదలను పెట్టి దీపాలను వెలిగిస్తారు. బాణసంచా కాల్చుతూ ప్రజలు ఘనంగా పండుగను జరుపుకుంటారు.

అయితే వాస్తవానికి దీపావళి పండుగను జరుపుకునే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది.. మొదటి సారిగా  ఎప్పుడు ఎక్కడ దీపాలు వెలిగించారు, బాణసంచా కాల్చడం ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా.. ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ రోజు తెలుసుకుందాం..   .

దీపావళిని ఎప్పటి నుండి జరుపుకోవడం మొదలు పెట్టారంటే..

దీపాల పండుగ హిందూ గ్రంధమైన స్కాంద పురాణం, అగ్నిపురాణంలో ప్రస్తావించబడింది. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం నుంచి దీపావళి జరుపుకుంటున్నారని నమ్ముతారు. అనంతరం దీపావళిని ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకోవడం మొదలు పెట్టారు. దీపావళిని జరుపుకునే సంప్రదాయం 5000 సంవత్సరాల నాటిదని నమ్మకం. స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యంలో శ్రీ కృష్ణుడు దీపాలను వెలిగించడం సూర్యుని పూజించడంలో ఒక భాగమని వర్ణించాడు. దీపావళి గురించి అంతర్దృష్టిని అందించే స్కంద పురాణంలో కొన్ని శ్లోకాల్లో ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

మొదటి దీపదాన పండుగ ఎక్కడ జరిగిందంటే..?

స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది “మద్రాజ్యే యే దీపానాం భువి కుర్వంతి మానవః.. ఈ శ్లోకాన్ని సరిగ్గా చదివితే.. ఇంతకు ముందు మద్రా రాష్ట్ర ప్రజలు దీపాలను వెలించారని.. దీప దానం చేశారని అర్ధం. మద్రా రాష్ట్రం అంటే ఇప్పుడు తక్షశిల.. పాకిస్తాన్‌లోని కాశ్మీర్ మధ్య ఉన్న ప్రదేశం. రాక్షస రాజు బలి దీపాలను దానం చేయడం మొదలు పెట్టాడట. బలి తన పాలనలో దీపాలను వెలిగించే సంప్రదాయాన్ని ప్రారంభించాడని నమ్ముతారు.

మొదటి దీపం ఎక్కడ పెట్టారంటే

దాదాపు 5 వేల సంవత్సరాల క్రితం అంటే సింధు నాగరికతకు నాల్గవ సహస్రాబ్దికి ముందు మట్టి దీపాలను ఉపయోగించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. సింధు లోయలోని త్రవ్వకాల్లో మెహర్‌ఘర్‌లోని పురావస్తు శాఖ బృందం పురాతన మట్టి దీపాలను కనుగొన్నారు. తరువాత కార్బన్ డేటింగ్ చేసినప్పుడు, ఈ దీపాలు సుమారు 5 వేల సంవత్సరాల నాటివని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇదే విధంగా ఇటువంటి  సంఘటన భారతదేశంలోని సంగల్‌లో కూడా జరిగింది. 2500 సంవత్సరాల క్రితం మౌర్యుల కాలం నాటి దీపాలు సంగల్ లో దొరికాయి.

బాణాసంచా కాల్చడం ఎప్పుడు మొదలు పెట్టారంటే

కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో బాణాసంచా ఉపయోగించినట్లు.. రాకెట్‌ను కాల్చినట్లు తెలుస్తుంది. 2396 సంవత్సరాల క్రితం రచించిన తన అర్థశాస్త్రంలోని 14వ అధ్యాయంలో కౌటిల్యుడు ‘తేజాంచూర్ణం’ చేసే విధానాన్ని వివరించాడు. తేజాన్‌ పౌడర్‌కు నిప్పంటించగానే నిప్పురవ్వలు వచ్చాయని పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతున్నాయా.. ఈ చిట్కాలు బెస్ట్!
తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతున్నాయా.. ఈ చిట్కాలు బెస్ట్!
కలియుగాంతాన్ని సూచించే ఈ ఆలయం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
కలియుగాంతాన్ని సూచించే ఈ ఆలయం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
నన్ను అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది:
నన్ను అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది:
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. నటి జ్యోతితో కలిసి
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. నటి జ్యోతితో కలిసి
పేదింటి పిల్లలకు ఉచితంగా గొప్పచదువులు.. నవోదయకు దరఖాస్తు చేశారా?
పేదింటి పిల్లలకు ఉచితంగా గొప్పచదువులు.. నవోదయకు దరఖాస్తు చేశారా?
ఆ అలవాటు ఉంటే యమ డేంజర్ అంట.. ఇందుకే అంటారు న‌య‌నం ప్ర‌ధానం అని..
ఆ అలవాటు ఉంటే యమ డేంజర్ అంట.. ఇందుకే అంటారు న‌య‌నం ప్ర‌ధానం అని..
పోలింగ్ బూత్‌లో పబ్లిక్ టాయిలెట్‌పై అక్షయ్‌కు వృద్ధుడు ఫిర్యాదు
పోలింగ్ బూత్‌లో పబ్లిక్ టాయిలెట్‌పై అక్షయ్‌కు వృద్ధుడు ఫిర్యాదు
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీరే
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీరే
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌
ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ
ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ