Diwali 2023: వోకల్ ఫర్ లోకల్.. మండీకి వెళ్లి స్వయంగా మట్టిప్రమిదలు కొనుగోలు చేసిన సీఎం

కుమ్హర్ మండి ప్రాంతంలో సందర్శించి దీపావళి సందర్భంగా మట్టి దీపాలను,  ఇతర వస్తువులను సిద్ధం చేసే కుమ్మరులను కలిశారు సీఎం. ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా మట్టి దీపాలను కొనుగోలు చేశారు. దీపావళి రోజున ప్రజల ఇళ్లలో వెలిగించే దీపాలు కుమ్మరుల ఆనందానికి, ఆర్థిక శ్రేయస్సుకు మాధ్యమంగా మారాయని ముఖ్యమంత్రి అన్నారు.

Diwali 2023: వోకల్ ఫర్ లోకల్.. మండీకి వెళ్లి స్వయంగా మట్టిప్రమిదలు కొనుగోలు చేసిన సీఎం
Cm Pushkar Singh DhamiImage Credit source: ANI
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2023 | 9:33 AM

దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా మట్టి ప్రమిదలు, బాణాసంచా కొనుగోలుకు ప్రజలు దుకాణాల వద్దకు బారులు తీరుతున్నారు. ప్రజల్లో వచ్చిన సామజిక సృహతో మళ్ళీ దేశీయ ఉత్పత్తులవైపు దృష్టి సారించారు. దీంతో ఈ ఏడాది దీపావళి పండగ కొంతమంది చేతి వృత్తులవారికి ఆర్ధిక స్వాలంభన ఇచ్చినట్లు అయింది. మట్టి దీపాలను, వస్తువులను రెడీ చేస్తున్న కుమ్మరులను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పలకరించారు. కుమ్హర్ మండి ప్రాంతంలో సందర్శించి దీపావళి సందర్భంగా మట్టి దీపాలను,  ఇతర వస్తువులను సిద్ధం చేసే కుమ్మరులను కలిశారు సీఎం. ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా మట్టి దీపాలను కొనుగోలు చేశారు.

దీపావళి రోజున ప్రజల ఇళ్లలో వెలిగించే దీపాలు కుమ్మరుల ఆనందానికి, ఆర్థిక శ్రేయస్సుకు మాధ్యమంగా మారాయని ముఖ్యమంత్రి అన్నారు. కొనుగోలు చేసిన దీపాలకు డబ్బులను డిజిటల్ పద్దతిలో చెల్లిస్తూ.. దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరిగాయని ముఖ్యమంత్రి అన్నారు.

ఇవి కూడా చదవండి

మట్టి దీపాలను కొనుగోలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

“ప్రపంచంలో అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశం భారతదేశం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి అన్నారు. దేశం డిజిటలైజేషన్ రంగంలో శరవేగంగా పురోగమిస్తోందని, కొన్నేళ్లుగా యూపీఐ మరింతగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ.. అలవాట్లలో ఒక భాగం.

ఈ దీపావళి నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పురస్కరించుకుని, స్థానిక ఉత్పత్తులను వీలైనంతగా ప్రచారం చేస్తూ స్వావలంబన భారతదేశం సంకల్పం నెరవేరడానికి మనమందరం సహకరించగలమని ముఖ్యమంత్రి అన్నారు. మన సంప్రదాయ ఉత్పత్తులకు కూడా గుర్తింపు వస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు స్థానిక ఉత్పత్తుల కొనుగోలుపై శ్రద్ధ పెడితే మన దేశం కూడా ఆర్థికంగా బలపడుతుందని, స్థానిక ఉత్పత్తిదారుల శ్రేయస్సు కూడా పెరుగుతుందని అన్నారు.

దీపావళి పండగ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. లక్ష్మీదేవి, శ్రీ గణపతి ఆశీస్సులు ఉండాలని.. ప్రతి ఒక్కరి జీవితం ఆరోగ్యంగా సాగాలని, ఆనందం, శ్రేయస్సు, శాంతి,  తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..