Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2023: రోజుకు 3 రంగులు మార్చే లక్ష్మిదేవి విగ్రహం.. 7 శుక్రవారాలు దర్శించుకుంటే సిరిసంపదలకు కొదవు ఉండదు..

అలాంటి ఆకృతిని, రంగును మార్చుకునే ఆలయంలో లక్ష్మీ దేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ దేవత విగ్రహం రంగు కూడా మారుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని విశ్వాసం. ఇంట్లో గొడవలు, ఆర్థిక లోటు వంటి అనేక సమస్యలకు ఈ ఆలయంలో పరిష్కారాలు దొరుకుతాయి. ఈ రోజు రహస్యాన్ని దాచుకున్న లక్ష్మీదేవి దేవాలయం గురించి చెప్పుకుందాం

Diwali 2023: రోజుకు 3 రంగులు మార్చే లక్ష్మిదేవి విగ్రహం.. 7 శుక్రవారాలు దర్శించుకుంటే సిరిసంపదలకు కొదవు ఉండదు..
Pachmatha Temple
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2023 | 8:35 AM

జీవితంలో వెలుగులు, ఉత్సాహం నింపే దీపావళి పండుగను జరుపుకోవడానికి యావత్ దేశం సిద్ధమైంది. ఈ పర్వదినాన లక్ష్మీ దేవి, గణేషునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారి విశేష ఆశీస్సులు పొందితే జీవితంలో డబ్బుకు లోటు ఉండదని విశ్వాసం. దీపావళి ఆరాధన సుఖ సంతోషాలకు చాలా పవిత్రమైనది.  భారతదేశంలో అనేక అద్భుతమైన రహస్యమైన దేవుళ్ళ ఆలయాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని విగ్రహాలు స్వయంభువుగా వెలిసినవే.. అదే సమయంలో కొన్ని చోట్ల విగ్రహాల ఆకృతి స్వయంచాలకంగా  మారిపోతాయి.

అలాంటి ఆకృతిని, రంగును మార్చుకునే ఆలయంలో లక్ష్మీ దేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ దేవత విగ్రహం రంగు కూడా మారుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని విశ్వాసం. ఇంట్లో గొడవలు, ఆర్థిక లోటు వంటి అనేక సమస్యలకు ఈ ఆలయంలో పరిష్కారాలు దొరుకుతాయి. ఈ రోజు రహస్యాన్ని దాచుకున్న లక్ష్మీదేవి దేవాలయం గురించి చెప్పుకుందాం.

లక్ష్మిదేవి ఆలయం

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న పచ్చమాత ఆలయం అనేక రహస్యాలను దాచుకుంది. దీని చరిత్ర సుమారు 1100 సంవత్సరాల నాటిది.. గోండ్వానా పాలనలోని రాణి దుర్గావతకు సంబంధించినదని చెబుతారు. క్వీన్స్ దివాన్ ఆధార్ సింగ్ పేరు మీద ఉన్న అధర్తల్ చెరువులో ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఆలయ ప్రాంగణంలో ఇతర దేవుళ్ళు, దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రంగు మారే విగ్రహం

ఈ ఆలయం తంత్ర సాధనకు ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రతిష్టించిన లక్ష్మీ దేవి విగ్రహం మూడుసార్లు రంగు మారుతుంది. ఈ కారణంగా ఇది విశిష్ట దేవాలయాల జాబితాలో చేర్చబడింది. విగ్రహం రంగు ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపు, సాయంత్రం నీలంగా మారుతుందని నమ్మకం. అంతే కాదు ఆలయంలోని అమ్మవారి పాదాలపై కూడా సూర్యకిరణాలు పడతాయి. సూర్య భగవానుడు లక్ష్మీదేవికి ఈ విధంగా నమస్కరిస్తున్నాడని ప్రజల నమ్మకం.

ఎప్పుడు రద్దీగా ఉంటుంది

రంగుల మారే విగ్రహాన్ని దర్శించడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే ఈ ఆలయంలో శుక్రవారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. 7 శుక్రవారాలు దర్శనం చేసుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు