Viral Video: చిన్నారి బాలిక శరీరంపై రామ్, రాధా పేర్లు .. వైద్యులకు షాక్.. దైవానుగ్రహము అంటున్న తాత

ఎనిమిదేళ్ల సాక్షి శరీరంపై గత 15-20 రోజులుగా దైవ నామాలు వెలువడుతున్నాయి. హిందీ భాషలో ఉద్భవిస్తున్న ఈ పేర్లను స్పష్టంగా చదవవచ్చు. ఇది చూసిన కుటుంబ సభ్యులు మొదట్లో పట్టించుకోలేదు. తర్వాత గుర్తించి  బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాక్షి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ, సాక్షి శరీరంపై అకస్మాత్తుగా హిందూ దేవుళ్లు , దేవతల పేర్లు హిందిలో కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు. 

Viral Video: చిన్నారి బాలిక శరీరంపై రామ్, రాధా పేర్లు .. వైద్యులకు షాక్.. దైవానుగ్రహము అంటున్న తాత
Up Giral Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2023 | 1:50 PM

సృష్టిలో ఎన్నో వింతలూ.. విశేషాలు.. ఆధునిక కాలంలో కూడా సైన్స్ కు, వైద్యులకు సవాల్ విసురుతూ తరచుగా వింత ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలిక శరీరంపై రాధే-రాధే, రామ్-రామ్ అనే పదాలు  స్వయంచాలకంగా ఉద్భవించాయి. ఇది చూసి బాలిక కుటుంబ సభ్యులే కాదు వైద్యులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. కొందరు దీన్ని అద్భుతం అని.. మరికొందరు దైవానుగ్రహం అని అంటున్నారు. అయితే దేవుడిని పూజించడం అంటే చిన్నారి బాలికకు చాలా ఇష్టం అని బాలిక తండ్రి చెప్పాడు. అందుకే ఇలా జరుగుతోందని అంటున్నారు.

హర్దోయ్‌లోని మధోగంజ్ బ్లాక్‌లోని సహిజన్ గ్రామంలో నివసిస్తున్న రైతు దేవేంద్ర కుమార్తె ఎనిమిదేళ్ల సాక్షి శరీరంపై గత 15-20 రోజులుగా దైవ నామాలు వెలువడుతున్నాయి. హిందీ భాషలో ఉద్భవిస్తున్న ఈ పేర్లను స్పష్టంగా చదవవచ్చు. ఇది చూసిన కుటుంబ సభ్యులు మొదట్లో పట్టించుకోలేదు. తర్వాత గుర్తించి  బాలికను ఆస్పత్రికి తరలించారు. ఇది చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. అయితే బాలిక సమస్యకు  పరిష్కారం వైద్యులు కూడా చూపలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వైద్య శాస్త్రంలో ఇప్పటి వరకూ జరిగిన ఘటనలు ఏమీ నమోదు కాలేదని వైద్యులు చెబుతున్నారు.  ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాక్షి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ, సాక్షి శరీరంపై అకస్మాత్తుగా హిందూ దేవుళ్లు , దేవతల పేర్లు హిందిలో కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు.

అయితే తన కూతురు పరిస్థితిపై రైతు దేవేంద్ర ఆందోళన వ్యకం చేస్తున్నారు. ఇలా ఒకటి రెండు రోజులు కాదు 15-20 రోజులుగా జరుగుతోందని అన్నారు. అకస్మాత్తుగా సాక్షి చేతులు, కాళ్ళు, కడుపు, వీపుపై దైవ నామాలు కనిపించడం ప్రారంభించాయి. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కలత చెందడమే కాకుండా, బాలిక పాఠశాల సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు , ఆసుపత్రి వైద్యులు కూడా షాక్ అయ్యారు.

బాలికను పరీక్షించిన పిహెచ్‌సి వైద్యుడు సంజయ్ బాలికను వైద్య కళాశాలకు తీసుకెళ్లాలని సూచించారు. ఇలాంటి సంఘటన ఇంతకు ముందెన్నడూ చూడలేదని, వినలేదని డాక్టర్ సంజయ్ తెలిపారు. మరోవైపు, తన మనవరాలకి దైవం అంటే భయం భక్తి అన్నీ ఉన్నాయని.. పూజ బాగా చేస్తుందని సాక్షి  తాతగారు  శివబాలాక్ చెప్పారు. తమ కుటుంబం మొత్తం దైవ భక్తులే అని చెప్పారు. అందుకనే తన మనవరాలు  శరీరంపై ఇలాంటి అద్భుతాలు జరగడం దైవానుగ్రహం వల్లే జరిగే అవకాశం ఉందని రామయ్య ఆశీర్వాదం లభించిందని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే