Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: స్వీయ సంరక్షణ పక్కన పెట్టి ఇతర పనులపై దృష్టి పెట్టె వ్యక్తులు.. ఆ రాశులు ఏమిటో తెలుసా

  ప్రతి వ్యక్తి సొంతం లాభానికి కొంతైనా ప్రాధాన్యతనివ్వాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సమతుల్య,  సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యకరమైన స్వీయ-సంరక్షణ అలవాట్లను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర పనులపై దృష్టి పెట్టే ఐదు రాశులకు చెందిన వ్యక్తుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Astro Tips: స్వీయ సంరక్షణ పక్కన పెట్టి ఇతర పనులపై దృష్టి పెట్టె వ్యక్తులు.. ఆ రాశులు ఏమిటో తెలుసా
Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2023 | 10:08 AM

కొందరు తమకు తామే ముఖ్యమని భావిస్తారు. స్వార్ధంతో ఆలోచిస్తారు.. అదే సమయంలో మరికొందరు తమని తాము రక్షించుకుంటూ.. తమ వారి పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. అయితే అతి తక్కువమంది తమ కంటే స్వీయ రక్షణ కంటే.. తమని నమ్ముకున్నవారి శ్రేయస్సు, క్షేమం అని భావిస్తారు. మనిషి ఆలోచన తీరు అలవాట్లు కూడా రాశుల ప్రభావం అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. తమను తాము జాగ్రత్తగా చూసుకోకుండా ప్రతి ఒక్కరి శ్రేయస్సుని ఐదు రాశులవారు ఎక్కువగా ఆలోచిస్తారని పేర్కొంది. అయితే  ప్రతి వ్యక్తి సొంతం లాభానికి కొంతైనా ప్రాధాన్యతనివ్వాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సమతుల్య,  సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యకరమైన స్వీయ-సంరక్షణ అలవాట్లను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర పనులపై దృష్టి పెట్టే ఐదు రాశులకు చెందిన వ్యక్తుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశి వారి శక్తివంతమైన, ఉద్రేకపూరిత స్వభావానికి ప్రసిద్ధి చెందింది. తాము చేసే  ప్రయత్నాలలో, సాహసాలతో కష్టాల్లో చిక్కుకుపోతారు. వీరు ఒకొక్కసారి విశ్రాంతి తీసుకోవడం కూడా  మరచిపోతారు. స్వీయ రక్షణ బలహీనతకు సంకేతం కాదని వీరు గుర్తుంచుకోవాలి.

వృషభ రాశి: ఈ రాశివారు సుఖాన్ని ఇష్టపడతారు, తరచుగా మంచి ఆహారాన్ని, విశ్రాంతిని తీసుకోవడానికి ఇష్టపడతారు. అయినప్పటికీ వీరు తమ స్వీయ రక్షణపై పెద్దగా దృష్టిని పెట్టరు. అతిగా తినడం, వ్యాయామం చేయడం లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిలో జీవించడానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు. ఇది వీరి ఆరోగ్యంపై, సుఖ శాంతులపై ప్రభావం చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: ఈ రాశి వారు సామాజిక సీతాకోకచిలుకలని చెప్పవచ్చు. ఎల్లప్పుడూ కదులుతూ ఉంటారు . వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. చాలా బిజీగా ఉంటారు. నిరంతరం ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లే క్రమంలో తమ కోసం తాము సమయం కేటాయించుకోవడం మర్చిపోతారు.  ఎక్కువగా అలసిపోతారు కనుక వీరు తమని తాము రీఛార్జ్ చేసుకోవడానికి కి కొంత సమయం కేటాయించుకుని.. స్వీయ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.

సింహ రాశి: ఈ రాశి వారు తమ మీదనే అందరి దృష్టి ఉండాలని.. పది మందిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలని కోరుకుంటారు. చురుకుగా ఉంటారు. తమను తాము నిరూపించుకునే ఆలోచనతో విశ్రాంతి తీసుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు. ఇలాంటి సమయంలో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కనుక ఈ రాశివారు తమ ఆరోగ్యానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ప్రయాణాలు అంటే ఇష్టం.. సాహసం పట్ల వీరికున్న ప్రేమ స్థిరమైన స్వీయ-సంరక్షణ చర్యలను ఏర్పాటు చేసుకోవడం వీరిని మరచిపోయేలా చేస్తుంది. కనుక రోజువారీ పనుల్లో సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం.

ప్రతి ఒక్కరూ రాశులతో సంబంధం లేకుండా ఎవరికీ వారే స్వీయ రక్షణ కోసం ప్రాధాన్యత ఇవ్వాలి. తమ సుఖ సంతోషాలు, ఆరోగ్యం ప్రాధాన్యతనివ్వాలి. అదే సమయంలో తామని ఆశ్రయించిన వారి మంచి చెడులపై దృష్టిని కేంద్రీకరించవచ్చు. సమతుల్య, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యకరమైన స్వీయ-సంరక్షణ అలవాట్లను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!