Astro Tips: వివాహం జాప్యం లేదా దంపతుల మధ్య వివాదాలా ఈ గ్రహణ ప్రభావం కావొచ్చు..

వేద జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలు అని పిలువబడే తొమ్మిది గ్రహాల్లో రాహువు ఒకటి. తరచుగా కోరికలు, భౌతికవాదం, జీవితంలోని అసాధారణ అంశాలతో ముడిపడి ఉంటుంది. వివాహం విషయంలో జాతకంలో  రాహువు స్థానం మీ సంబంధాన్ని, వివాహ అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. రాహువు చేసే అశుభ కార్యాల్లో ప్రధానమైంది వివాహం ఆలస్యం. రాహువు వివాహానికి సంబంధించిన ఏడవ ఇంటిని ప్రభావితం చేస్తే.. ఆ వ్యక్తులు భాగస్వామిని కనుగొనడంలో అడ్డంకులు,  జాప్యాన్ని ఎదుర్కొంటారు.

Astro Tips: వివాహం జాప్యం లేదా దంపతుల మధ్య వివాదాలా ఈ గ్రహణ ప్రభావం కావొచ్చు..
Rahu In Marriage
Follow us
Surya Kala

|

Updated on: Nov 06, 2023 | 7:35 AM

వేద జ్యోతిషశాస్త్రంలో  నవ గ్రహాల్లో రాహువు ఒకటి. ఈ రాహు గ్రహం వివాహంతో సహా జీవితంలోని వివిధ అంశాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన మలుపు.. ఈ వైవాహిక జీవితం శుభా అశుభాలను రాహువు నిర్ణయిస్తుంది. రాహువు ప్రభావంతో వైవాహిక జీవితానికి అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో రాహు ప్రయాణం గురించి అవగాహన కోసం నిపుణులైన జ్యోతిష్కుడి సలహాలను తీసుకోవాలి.

రాహువు ప్రభావాన్ని అర్థం చేసుకోవడం:

వేద జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలు అని పిలువబడే తొమ్మిది గ్రహాల్లో రాహువు ఒకటి. తరచుగా కోరికలు, భౌతికవాదం, జీవితంలోని అసాధారణ అంశాలతో ముడిపడి ఉంటుంది. వివాహం విషయంలో జాతకంలో  రాహువు స్థానం మీ సంబంధాన్ని, వివాహ అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

అశుభ రాశులు:

వివాహం ఆలస్యం: రాహువు చేసే అశుభ కార్యాల్లో ప్రధానమైంది వివాహం ఆలస్యం. రాహువు వివాహానికి సంబంధించిన ఏడవ ఇంటిని ప్రభావితం చేస్తే.. ఆ వ్యక్తులు భాగస్వామిని కనుగొనడంలో అడ్డంకులు,  జాప్యాన్ని ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి

సాంప్రదాయేతర వివాహాలు: రాహువు ప్రభావం కులాంతర లేదా అంతరం మత సంబంధాల వంటి సాంప్రదాయేతర, అన్యదేశ వివాహాలకు దారి తీస్తుంది. కొన్ని సంస్కృతులలో రాహువు అశుభకరమైనదిగా పరిగణిస్తారు.

వైవాహిక అసమ్మతి: ఎవరి జాతకంలో రాహువు కొన్ని స్థానాల్లో ఉండటం వల్ల వైవాహిక వైరుధ్యాలు, విభేదాలు, అస్థిరత, సంబంధంలో అపనమ్మకం ఏర్పడవచ్చు.

అవిశ్వాసం: కొన్ని సందర్భాల్లో రాహువు శక్తి.. వ్యక్తుల వివాహ బంధంలో అవిశ్వాసం లేదా రహస్య ప్రవర్తనకు గురి చేస్తుంది. భార్యాభర్తల సంబంధాన్ని దెబ్బతీస్తుంది.

వివాహంలో అశుభ రాహువు కారణాలు:

వివాహంపై రాహువు అశుభ ప్రభావానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. కుజుడు లేదా శని వంటి గ్రహాలతో కలయిక, నిర్దిష్ట గృహాలలో రాహు ప్రయాణం, గత చర్యల నుండి కర్మ ప్రభావాలు, రాహువుతో కూడిన కాల సర్ప దోషం లేదా గ్రహణ దోషం వంటి దోషాలు

శుభప్రదం కోసం చేయాల్సిన పరిహారాలు..

ఎవరి వివాహంలోనైనా రాహువు పాత్ర గురించి లోతైన అవగాహన పొందడానికి.. నిపుణులైన జ్యోతిష్కుడిని సంప్రదించడం మంచిది. రాహువు ఏర్పరచే సవాళ్లను పరిష్కరించడానికి సరైన దిశ నిర్దేశం, పరిష్కారాలను అందించగలరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్