AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల కొండపై ఈ తప్పులు అస్సలు చేయకండి.. పెళ్లైన 6 నెలల వరకూ..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కోరి కొలిస్తే తమ కష్టాలు తీరుస్తాడని నమ్మకం. భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలను అందుకుంటున్న శ్రీవారిని దర్శించుకోవడానికి రాజకీయ నేతలు, సెలబ్రెటీలు , సామాన్యులు అనే తేడా లేకుండా ఏడుకొండలు ఎక్కి ఏడుకొండల వాడిని దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి కొందరు తిరుమలకు కాలినడకన వెళ్లారు. అయితే తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్లిన వారు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పులు చేయడం వలన తీర్ధ యాత్ర చేసిన ఫలితం దక్కదని పెద్దల ఉవాచ. ఈ నేపథ్యంలో తిరుమల క్షేత్రంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Nov 04, 2023 | 12:56 PM

Share
Tirumala: తిరుమల కొండపై ఈ తప్పులు అస్సలు చేయకండి.. పెళ్లైన 6 నెలల వరకూ..

1 / 7
తిరుమల క్షేత్రానికి మరో పేరు ఆది వరాహ క్షేత్రం. కొండపైకి చేరుకున్న తర్వాత చాలామంది మలయప్ప స్వామిని దర్శించుకుంటారు. అయితే వాస్తవానికి తిరుమల కొండపై అడుగు పెట్టిన వెంటనే స్వామివారిని దర్శించుకోవడం కాకుండా.. ముందుగా వరాహ స్వామిని దర్శించుకోవాలి.  భూదేవి రక్షించడం కోసం వరాహస్వామి అవతారం ఎత్తిన విష్ణు మూర్తి .. అనంతరం తిరుమల కొండపై కొలువై ఉన్నాడు. కాలక్రమంలో విష్ణుమూర్తి తనను వీడిన లక్ష్మీదేవిని వెదుక్కుంటూ భూలోకానికి చేరుకున్నాడు.

2 / 7
ఆ సమయంలో తిరుమల కొండపై నివసించడానికి 100 అడుగుల స్థలం ఇవ్వమని వరాహస్వామి కోరినట్లు.. అప్పుడు తనకు మొదట పూజ, నైవేద్యం ఇవ్వాలని కండిషన్ పెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై ఉండడానికి అంగీకరించాడని పురాణాల కథనం. స్వామివారి ఇచ్చిన వరం ప్రకారం.. స్వామివారిని దర్శించుకోవడానికి ముందు వరాహస్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. 

3 / 7
Tirumala

Tirumala

4 / 7
మాడ వీధుల్లో : తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులను మాఢవీధులు అంటారు.   స్వామివారు ఈ మాఢవీధుల్లో విహరిస్తూ ఉంటారు. ఈ వీధులను పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకనే ఈ మాఢవీధుల్లో ఎటువంటి వారైనా సరే చెప్పులతో తిరగడం నిషేధం.. అంతేకాదు ఈ వీధుల దగ్గర చెప్పులు ధరించి తిరగవద్దు అనే హెచ్చరికతో బోర్డు ఉంటుంది. అయితే కొందరు తెలిసి .. లేక తెలియక చెప్పులు వేసుకుని ఈ వీధుల్లో తిరుగుతూ ఉంటారు.    

5 / 7
పువ్వులు పెట్టుకోవడం: తిరుమల క్షేత్రంలో వికసించే ప్రతి పువ్వుని స్వామివారి కైంకర్యానికి ఉపయోగిస్తారు. అంతే కాదు శ్రీవారి సేవకు ఉపయోగించిన ప్రతి పువ్వుని ఎవరికీ ఇవ్వరు.. వాటిని భూ తీర్ధంలో చూపించి అడవిలో వదిలి వేస్తారు. అందుకనే తిరుమల క్షేత్రంలో మహిళలు పువ్వులు పెట్టుకోరాదు అని పెద్దలు చెప్పడమే కాదు.. అనేక ప్రాంతాల్లో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కానీ చాలామంది ఈ నిబంధనను పట్టించుకోకుండా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనం కోసం ఆలయం లోపలకు వెళ్లారు. అక్కడ స్వామివారి సేవకులు ఈ విషయంపై తరచుగా హెచ్చరిక చేస్తూ ఉంటారు. 

6 / 7
Tirumala: తిరుమల కొండపై ఈ తప్పులు అస్సలు చేయకండి.. పెళ్లైన 6 నెలల వరకూ..

7 / 7
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?