- Telugu News Photo Gallery Spiritual photos Sri venkateswara swamy brahmotsavam 2023 in Konaseema Tirupati Vadapalli
Konaseema Tirupati: వైభవంగా కోనసీమ తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారి నామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయ ప్రాంగణం..
కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. అంబెడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 2 నుంచి 10వ తేది వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు..వైభవంగా నిర్వహిస్తున్నారు.
Pvv Satyanarayana | Edited By: Surya Kala
Updated on: Nov 04, 2023 | 12:43 PM

కోనసీమ తిరుపతిగా పిలుచుకునే ఆత్రేయ పురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. శ్రీవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంది.... గోదావరి తీరాన పచ్చటి చేలగట్ల మధ్య ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శించుకునేందుకు చుట్టుపక్కల వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసారు ఆలయ అధికారులు... ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీర్చే వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం..

కోనసీమ తిరుపతి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ కాంతులతో విలాజల్లుతుంది... మేళ తాళాలు డప్పు చప్పులతో మార్మోగుతుంది ఆలయ ప్రాంగణం

వాడపల్లి ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆలయం చుట్టూ ఉన్న పై కప్పు గోవిందనామాలతో నిండి ఉంటుంది...ప్రదక్షిణలు నిర్వహిస్తున్నప్పుడు భక్తులు వాటిని గోవింద నామ స్మరణతో పఠించడానికి సహాయపడుతుంది... ప్రతి శనివారం ఆలయానికి అర కిలోమీటరు దూరంలో మేళా(జాతర) స్టాళ్లు ఏర్పాటు చేస్తారు.

వేంకటేశ్వర స్వామి దేవత గంధపు చెక్కతో చేయబడింది. ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వర స్వామి అని కూడా పిలువబడేది శ్రీ వేంకటేశ్వర స్వామికి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి... ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు..

కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం పట్టణానికి 10 కి.మీ దూరంలో ఉంది. ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరిక నెరవేరుతుంది అనేది వాడపల్లిలో నానుడి. ఆలయంలో ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఎంతో ప్రత్యేకత ఉంది.

ప్రతి శనివారం ఈ ఆలయానికి 50 వేల నుండి 75 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు కావడంతో ప్రతిరోజు వివిధ వాహన సేవలు విశేష పూజలు అందుకుంటున్నాడు వెంకటేశ్వర స్వామి..

మూడు రోజుల నుంచి వైభవంగా జరుగుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబయింది. విద్యుత్ కాంతులతో సరికొత్త అందాలను సంతరించుకుంది. తొమ్మిది రోజులపాటు జరగబోయే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రాజు, ఈవో తెలిపారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు ఆలయ సిబ్బంది.





























