Dhanteras 2023: ఈ 7 రాశుల వారికి ధన్‌తేరస్ రోజు ఎలా ఉంటుంది.. ఆరోగ్యం, అభివృద్ధి కోసం ఏమి చేయాలంటే

అమృత ఘడియల్లో ధన్వంతరి, గణపతి, లక్ష్మీదేవిని పూజించండి. ఇలా పూజ చేయడం వలన ఏడాది పొడవునా వ్యాపార అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. లక్ష్మి దేవి, గణేష్, కుబేరుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. పురాణ గ్రంధాల ప్రకారం కొత్త పాత్రలు, వెండి, బంగారం మొదలైన వాటిని ధన్ త్రయోదశి రోజున కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది.

Dhanteras 2023: ఈ 7 రాశుల వారికి ధన్‌తేరస్ రోజు ఎలా ఉంటుంది.. ఆరోగ్యం, అభివృద్ధి కోసం ఏమి చేయాలంటే
ధన్ తేరాస్ .. ఆశ్వయుజ మాసంలోని త్రయోదశి తిథి రోజున సముద్ర మథన సమయంలో  ధన్వంతరి  ఉద్భవించాడు. అప్పటి నుంచి  ధన్ తెరాస పండగ మొదలైంది. ధన్‌తేరస్‌లో కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇంటికి తీసుకురావడం ఒక సంప్రదాయం. ఈ రోజున దీపాలను దానం చేయాలనే నమ్మకం కూడా ఉంది.. తద్వారా యమరాజు సంతోషిస్తాడు. ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ సంవత్సరం ఈ పండుగను 10 నవంబర్ 2023 న జరుపుకోనున్నారు. 
Follow us
Surya Kala

|

Updated on: Nov 09, 2023 | 8:45 AM

హిందూ మతంలో నవంబర్ 10న ధన్‌తేరస్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం ధన త్రయోదశి రోజున సముద్ర మథనం సమయంలో ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి అమృతం కలశంతో జన్మించాడు. అందుకే ఈ రోజును ధన్వంతరి జయంతి అని కూడా అంటారు. ధన్‌తేరస్‌ రోజున ధన్వంతరిని పూజించడం వల్ల ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉంటారు. ధన్ తేరాస్ ఘడియలు శుక్రవారం హస్తా నక్షత్రం రాత్రి 12:21 వరకు ఉంటుంది. రోజంతా అమృత యోగం ఉంటుంది, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. త్రయోదశి తిథి సంధ్యా సమయంలో వస్తుంది. కాబట్టి ఈసారి ధనత్రయోదశి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

ధన్‌తేరస్‌ రోజున కుబేరుడు గణేశుడు, లక్ష్మీ దేవిని పూజించే విధానం పురాణగ్రంధాలలో చెప్పబడిందని జ్యోతిష్కుడు చెప్పారు. వ్యాపారస్తులు ధన్‌తేరస్‌ రోజున స్థిర లగ్నం, వృషభ రాశి సంధ్యా సమయంలో సాయంత్రం 05:31 నుండి 07:28 వరకు.. ఉంటుంది. అమృత ఘడియల్లో ధన్వంతరి, గణపతి, లక్ష్మీదేవిని పూజించండి. ఇలా పూజ చేయడం వలన ఏడాది పొడవునా వ్యాపార అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. లక్ష్మి దేవి, గణేష్, కుబేరుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.

పురాణ గ్రంధాల ప్రకారం కొత్త పాత్రలు, వెండి, బంగారం మొదలైన వాటిని ధన్ త్రయోదశి రోజున కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ధన్‌తేరస్‌లో షాపింగ్ చేయడానికి అనుకూలమైన సమయం మధ్యాహ్నం 12:53 నుండి 02:24 వరకు.. సాయంత్రం 05:30 నుండి 07:27 వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ధన్‌తేరస్‌ పండుగ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

  1. మేష రాశి వారు వ్యాపారంలో అభివృద్ధిని, ఆర్థిక లాభాన్ని పొందుతారు.
  2. వృషభ రాశి వారు రోగాల బారిన పడతయారు. కనుక ఈ రాశివారు శివుడిని పూజించడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
  3. మిథున రాశి ఉన్నవారు ధన్‌తేరస్ రోజున వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. అయితే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
  4. కర్కాటక రాశి వారికి శత్రువుల భయం భగవతీ దేవిని పూజించడం, తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.
  5. సింహ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కానీ ఎవరికైనా ఆలోచనాత్మకంగా డబ్బులు ఇవ్వండి.
  6. కన్య రాశి వారు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. గణపతికి దర్భలను సమర్పించండి.
  7. తులారాశి వారు ధనం వృధా చేస్తారు, అయితే శివుని ఆరాధించడం ద్వారా తమ కార్యాలలో విజయం సాధిస్తారు.
  8. వృశ్చిక రాశి వారు అనవసరంగా తిరుగుతూనే ఉంటారు. హనుమంతుడిని పూజించండి. ఎరుపు రంగు వస్తువులను దానం చేయండి. సమస్యలన్నీ తొలగిపోతాయి.
  9. ధనుస్సు రాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది.
  10. మకర రాశి వారు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే హనుమంతుడిని పూజించాలి.
  11. కుంభ రాశి వ్యక్తులు పనిలో పెరుగుదలను చూస్తారు. ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు.
  12. మీన రాశి వారు మానసిక క్షోభకు గురవుతారు. పసుపు వస్తువులను దానం చేయండి. ఖచ్చితంగా లాభాలను పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు