Horoscope Today: ఉద్యోగం మారేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా..

దిన ఫలాలు (నవంబర్ 7, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థికపరంగా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఉద్యోగం మారేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా..
Horoscope Today 07th November 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 07, 2023 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 7, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థికపరంగా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరి స్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా, సామరస్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సామా జిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థికపరంగా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గే సూచనలున్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అను కూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా కలిసి వస్తాయి. ముఖ్య మైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థికంగా కాస్తంత అభివృద్ధి ఉంటుంది. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలనిటినీ సానుకూలంగా పూర్తి చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన భద్రత, స్థిరత్వం లభిస్తాయి. సామాజికంగా అనుకోని గుర్తింపు లభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వ్యాపా రాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో చికాకులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతుంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా ప్రమోషన్ రావచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆదా యానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. కొన్ని ప్రయత్నాల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహ రిస్తే అంత మంచిది. వివాహ సంబంధం నిశ్చయం అవుతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగు తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల నుంచి మంచి శుభవార్తలు అందు తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగపరంగా ఆశించిన శుభ సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబపరంగా అభివృద్ధి ఉంటుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యంలో చాలావరకు మెరుగ్గా ఉంటుంది. మంచి పరి చయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగానే నెరవే రుతాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. సతీమణి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. కుటుంబపరంగా శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. స్నేహి తులు, సహచరుల వల్ల ఇబ్బందులు ఉండవచ్చు. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాల్లో సహనంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

మంచి పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాలలో వృత్తి, ఉద్యోగాలలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహా రాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి గుర వుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర వ్యవహారాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుం టాయి. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగతం గానే కాకుండా కుటుంబపరంగా కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాలు పరిష్కారం అవు తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. సతీమణికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

(Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!