Shani Dev: శనితో ఇక వారికి శుభాలే శుభాలు..! మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందంటే..?
స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు నవంబర్ 5 నుంచి తన వక్ర సంచారానికి స్వస్తి చెప్పి రుజు మార్గంలో ప్రయాణం ప్రారంభించినందువల్ల ఎక్కువ రాశుల వారికి శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. సుమారు ఆరు నెలలుగా ఆదాయపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా చిక్కుల్లో ఉన్నవారికి, చెప్పుకోలేని బాధలు పడుతున్నవారికి ఇక ఉపశమనం లభించే అవకాశం ఉంది. శనీశ్వరుడి రుజు సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఏ విధమైన ఫలితాలుండబోయేదీ ఇక్కడ పరిశీలిద్దాం.
స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు నవంబర్ 5 నుంచి తన వక్ర సంచారానికి స్వస్తి చెప్పి రుజు మార్గంలో ప్రయాణం ప్రారంభించినందువల్ల ఎక్కువ రాశుల వారికి శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. సుమారు ఆరు నెలలుగా ఆదాయపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా చిక్కుల్లో ఉన్నవారికి, చెప్పుకోలేని బాధలు పడుతున్నవారికి ఇక ఉపశమనం లభించే అవకాశం ఉంది. కర్కాటకం, వృశ్చికం, కుంభం, మీన రాశులు తప్ప మిగిలిన రాశుల వారికి అందరికీ శనీశ్వరుడు వీలైనంతగా ‘న్యాయం’ చేయడం జరుగుతుంది. మేషం, వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి అన్ని విధాలుగానూ అదృష్టం కలిసి వస్తుంది. మిథునం, సింహ రాశుల వారికి మంచి జరగకపోవచ్చు కానీ, చెడు మాత్రం జరగదని చెప్ప వచ్చు. శనీశ్వరుడి రుజు సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఏ విధమైన ఫలితాలుండబోయేదీ ఇక్కడ పరిశీలిద్దాం.
- మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడు అనేక ప్రయత్నాలను, అనేక పెండింగ్ పనులను నెర వేర్చడం జరుగుతుంది. ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆగిపోయిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా చేతికి అందడం ప్రారంభం అవుతుంది. జీవితంలో మళ్లీ వేగం పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. తప్పకుండా అధికారం చేపట్టడం జరుగుతుంది. రాజకీయా లతో సహా ఏ రంగానికి చెందినవారికైనా కొద్దో గొప్పో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం చక్కబడుతుంది.
- వృషభం: ఈ రాశివారికి దశమ స్థానంలో శని బాగా బలంగా ఉన్నందువల్ల పని భారం, బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభించడం, వీలైతే మరింత మంచి ఉద్యో గంలోకి మారడం, నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల్లో ఉద్యోగం లభించడం, ఇష్టమైన ప్రాంతా లకు బదిలీ కావడం, వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ముందుకు సాగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తండ్రికి అదృష్టం కలిసి వస్తుంది.
- మిథునం: ఈ రాశివారికి భాగ్యాధిపతిగా శనీశ్వరుడు భాగ్యస్థానంలోనే బలంగా సంచారం చేస్తూ ఉండడం వల్ల, పితృభాగ్యం చేతికి అందే అవకాశం ఉంది. ఆస్తి వివాదానికి సంబంధించిన కోర్టు కేసులు, బంధువులతో వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. విదేశాల నుంచి చదువులు, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. విహార యాత్రలు, తీర్థయాత్రల చేసే సూచన లున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా అధిక శ్రమ, ఒత్తిడి, తిప్పట తప్పకపోవచ్చు. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ‘చాకిరీ’ పెరిగే అవకాశం ఉంది. ఇతర అనుగ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నప్పుడు మాత్రమే శని దుష్ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. కొత్త పనులు, కార్యక్రమాలను చేపట్టకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
- సింహం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల పని భారం, బరువు బాధ్యతలు ఎక్కు వగా ఉన్నప్పటికీ, తప్పకుండా అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో నిదానంగా పురోగతి చెందడం జరుగుతుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల శనీశ్వరుడి దుష్ప్రభావం బాగా తగ్గుతుంది. రాజకీయాలు, అనాథాశ్రమాలు, సామాజిక సేవ, పౌర సంబంధాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఉన్నవారికి అధిక ధనయోగం పట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
- కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో రుజు సంచారం ప్రారంభించిన శనీశ్వరుడు తప్పకుండా రాజయోగం ఇస్తాడు. ఆదాయం బాగా పెరిగి, ఏ ప్రయత్నం చేసినా సఫలం అయి, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో పోటీదార్లు బాగా తగ్గుతారు. అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు.
- తుల: ఈ రాశివారికి శనీశ్వరుడి రుజు సంచారంతో అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం, పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం వంటివి జరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు, పథకాల వల్ల అదృష్టం పండుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- వృశ్చికం: ఈ రాశివారికి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువయ్యే అవకాశం ఉంది. బాగా కష్టపడితే తప్ప ఏ పనీ పూర్తి కాదు. బాగా వ్యయ ప్రయాసలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉండక పోవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఇతర గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నప్పుడు ఇటువంటి దుష్ప్రభావాలు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. తరచూ శివార్చన చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
- ధనుస్సు: తృతీయ స్థానంలో శనీశ్వరుడి రుజు సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విపరీత రాజ యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాబ ల్యం పెరగడంతో పాటు అధికారయోగం పట్టే అవకాశం కూడా ఉంది. మనసులోని కోరికలు నెర వేరుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. పలుకుబడి బాగా పెరుగుతుంది.
- మకరం: ఈ రాశికి అధిపతి, ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు వక్రగతి నుంచి బయటపడి రుజు మార్గంలో ప్రయాణిస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. జీతభత్యాలు సకాలంలో అందడం మొదలవుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం, కుటుంబ వ్యవహారాలు చక్కబడడం, శుభ కార్యం జరగడం వంటివి చోటు చేసుకుంటాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది.
- కుంభం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం కాస్తంత ఎక్కువయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీరంటే ఇష్ట పడేవారు, అభిమానం చూపించేవారు దూరం అవుతారు. ఏ పనీ ఒక పట్టాన కలిసి రాదు. ప్రయ త్నాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కానీ ఆదాయం తగ్గుతుంది.
- మీనం: ఈ రాశివారికి 12వ స్థానంలో శని సంచారం కారణంగా ఏలిన్నాటి శని జరుగుతున్నందువల్ల, ఆదాయం కన్నా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దైవ కార్యాలు, శుభ కార్యాలు, సహాయ కార్యక్రమాల మీద బాగా ఖర్చవుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. రహస్య శత్రువులు తయారవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది కానీ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన పరిహారాలు శనీశ్వరుడు మంచి స్థానాల్లో సంచరిస్తున్నా, చెడు స్థానాలో సంచరిస్తున్నా మధ్య మధ్య శివార్చన చేయించడం, సుందరకాండ పారాయణం చేయడం, దత్తాత్రేయుడిని పూజించడం వల్ల శని బాగా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అహంకారాన్ని తగ్గించుకోవడం, వినయ విధేయతలను పెంచుకోవడం వల్ల కూడా శనీశ్వరుడి దుష్ప్రభావం బాగా తగ్గుతుంది. శనీశ్వరుడిని దూషించినా, నిరసించినా ఈ గ్రహ చెడు ప్రభావం రెట్టింపవుతుంది. శనీశ్వరుడితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.