AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2023: దీపావళి పూజ సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..

దీపావళి పండుగ ముఖ్యంగా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి  జరుపుకుంటారు. ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు జ్యోతిష్యానికి సంబంధించిన కొన్ని పొరపాట్లను నివారించడం చాలా ముఖ్యం. తద్వారా భవిష్యత్ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావు. దీపావళి రోజున ఇంట్లో తప్పనిసరిగా ముగ్గుని వేస్తారు. ముగ్గులతో లక్ష్మీదేవిని స్వాగతం చెప్పినట్లు విశ్వాసం.  లక్ష్మీ పూజ చేసే ముందు ఇంటిని రంగోలితో అలంకరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

Diwali 2023: దీపావళి పూజ సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..
Diwali 2023
Surya Kala
|

Updated on: Nov 12, 2023 | 10:31 AM

Share

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. దీపావళి సమయంలో లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. అయితే పూజ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి.. లేకపోతే మీరు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీపావళి పూజలో చేసే చిన్న పొరపాట్లు మీకు చాలా సమస్యలను కలిగిస్తాయి. లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఇంట్లో ఏడాది పొడవునా సుఖ సంతోషాలు ఉంటాయని, మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. దీపావళి రోజున అనేక జ్యోతిష్య పరిహారాలను ప్రయత్నించడం మంచిది. ఈ పరిహారాల ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి.

దీపావళి పండుగ ముఖ్యంగా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి  జరుపుకుంటారు. ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు జ్యోతిష్యానికి సంబంధించిన కొన్ని పొరపాట్లను నివారించడం చాలా ముఖ్యం. తద్వారా భవిష్యత్ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావు.

దీపావళి రోజున ముగ్గులు

దీపావళి రోజున ఇంట్లో తప్పనిసరిగా ముగ్గుని వేస్తారు. ముగ్గులతో లక్ష్మీదేవిని స్వాగతం చెప్పినట్లు విశ్వాసం.  లక్ష్మీ పూజ చేసే ముందు ఇంటిని రంగోలితో అలంకరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలంటే

దీపావళి పూజ సమయంలో లక్ష్మీ దేవి, గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు దిశ ఉంది. లక్ష్మీ దేవి విగ్రహాన్ని గణపతికి కుడి వైపున ప్రతిష్టించాలని.. కమలంపై కూర్చొని, ఆశీర్వాద భంగిమలో ఉన్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని పూజించాలని నియమం.

పీఠం ఏర్పాటు

దీపావళి రోజున పూజ కోసం పీఠం ఏర్పాటు చేసే విషయంలో కూడా నియమాలున్నాయి. ఇనుము లేదా స్టీల్ పీఠం బదులుగా చెక్క పీటను ఉపయోగించాలి. చాలామంది లక్ష్మీ దేవి విగ్రహాన్ని స్టీల్ పీటపై ఉంచుతారు.  అలా చేయడం తప్పుగా పరిగణించబడుతుంది.

ఏ రంగులు దుస్తులు ధరించాలంటే

పీఠంపై వేసే దుస్తుల విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. ఎరుపు, పసుపు రంగు దుస్తులను ఎంపిక చేసుకోవాలి. పొరపాటున కూడా పీఠం మీద పరిచే దుస్తులకు నలుపు లేదా నీలం రంగులను ఉపయోగించవద్దు. విగ్రహాలను ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచవద్దు. విగ్రహం ప్రతిష్టించే ముందు పూల రేకులను ఉంచి, కొన్ని అక్షతలు వేసి అప్పుడు విగ్రహాలను ప్రతిష్టించండి.

పూజకు ఉపయోగించే సామాగ్రి

దీపావళి పూజ సమయంలో ఉపయోగించే సామాగ్రి విషయంలో జాగ్రత్త వహించాలి. దీపావళి పూజలో విరిగిన పాత్రలు లేదా విరిగిన విగ్రహాలు వంటి ఏదైనా విరిగిన వస్తువును ఎప్పుడూ ఉపయోగించకూడదు. మీరు పూజ సమయంలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కలశంలో మామిడి ఆకులను ఉంచడం..కొబ్బరికాయ పెట్టి కలశంలో నాణెం వేసి ఏర్పాటు చేసుకోవాలి.

దీపావళి పూజ చేసిన వెంటనే విగ్రహాలను తొలగించకండి.

దీపావళి పూజ తర్వాత వెంటనే పీఠాన్ని తీసివేయవద్దు. దీపావళికి సంబంధించిన అన్ని ఆచారాలు పూర్తయిన వెంటనే ఆలయాన్ని లేదా పూజా స్థలాన్ని శుభ్రం చేసే అలవాటు ఉంటుంది.. అయితే పూజ చేసిన వెంటనే ఆ స్థలాన్ని ఎప్పుడూ శుభ్రం చేయకూడదని గుర్తుంచుకోవాలి. పూజ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని.. ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. కనుక వెంటనే ఆ స్థలాన్ని శుభ్రం చేస్తే, ప్రతికూల పరిణామాలు ఉండవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్