Ishtakameshwari: ఆ అమ్మవారిని దర్శించుకోవాలంటే.. రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టుల రికమండేషన్ కావాలి!

ఇష్టకామేశ్వరి దేవి ఈ పేరు విన్న వెంటనే ఒంట్లో ఒక రకమైన ఆధ్యాత్మిక వైబ్రేషన్ వస్తాయి. అలాంటి ఇష్టకామేశ్వరి దేవి ఆలయాన్ని చూడాలంటే పోటీ పడాల్సి వస్తుంది. స్థానిక పోలీసులు, ఆలయ అధికారులు, రాజకీయ నాయకులు, చివరకు జర్నలిస్టులతో రికమండేషన్ చేయించుకుని దర్శనం చేసుకునే పరిస్థితి వచ్చింది. నల్లమల అభయారణ్యంలో ఉండటం, రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. 

J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Nov 12, 2023 | 12:10 PM

కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా, నల్లమల అడవిలో కొలువైన ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటే భక్తులకు ఎంతో మక్కువ. దట్టమైన అభయారణ్యంలో దైవాన్ని దర్శించుకోవడం అంత సాధ్యం కాదు.  ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించేందుకు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించేందుకు క్యూ కడుతున్నారు. అయితే భక్తులందరికీ అమ్మవారి దర్శనం సాధ్యం కాకపోవడంతో భక్తులు అసహనానికి గురవుతున్నారు.

1 / 11
ఒకప్పుడు కేవలం ఇక్కడి పర్వత ప్రాంతంపై ఉండే గూడెం ప్రజలు మాత్రమే మల్లన్నను దర్శించుకునే వారు. పల్లవులు, విజయనగరరాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం.

2 / 11
భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలను అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం  ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టుపెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా, ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు

3 / 11
పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటుంది. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.

4 / 11
ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు అమ్మవారు కనిపిస్తారు. ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ఇక్కడ పరిసరాల్లో కూర్చుకుని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. స్థానికంగా నివసించే చెంచులచే అమ్మవారు పూజలందుకుంటున్నారు. అంతేకాకుండా ఎక్కడికి వచ్చే భక్తులకు చెంచులు నిత్య అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేశారు..

5 / 11
కొంతమంది భక్తులు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించేందుకు దేశం నలుమూలన నుంచి  వచ్చే ప్రతి ఒక్క భక్తులకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు..

6 / 11
నల్లమల అభయారణ్యంలో వెలసిన ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శంచుకోవాలంటే కాస్తంత సాహసం చేయాల్సిందే. ఈ యాత్ర యావత్తూ వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే టైగర్‌ రిజర్వు అటవీ ప్రాంతం కావటంతో అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. కొంతకాలంగా ఈ యాత్ర అటవీశాఖ అనుమతులతోనే సాగుతుంది. శ్రీశైలం సమీపంలో ఉన్న శిఖరం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

7 / 11
శిఖరం వద్ద అటవీశాఖ అధికారులు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి అలయానికి చేరుకోవటానికి టికెట్లు బుక్‌ చేసుకుంటారు. 10 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

8 / 11
ఆలయానికి వెళ్లే ప్రతి వ్యక్తికి రూ.1000 చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇష్టకామేశ్వరుని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ ముందు రోజే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

9 / 11
టికెట్లు నెక్కంటి జంగిల్ సఫారీ నందు 104 టికెట్లు మరియు ఆన్లైన్ ద్వారా  NSTR.COM నందు 16 టికెట్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. అలా ఒక్కో వాహనంలో కేవలం 8 మంది మాత్రమే వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి.

10 / 11
అలా మొత్తంగా రోజుకు  5జీపులు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తారు. టికెట్లు తీసుకున్న అరగంట నుండే వాహనాలు ప్రారంభమవుతాయి. ఇలా కష్టసాధ్యమైన యాత్రను చేసే ప్రతి ఒక్కరూ తాము కోరిన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ..  అవి తీరగానే తమ మొక్కులను తీర్చుకుంటుంటారు.

11 / 11
Follow us