Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొరపాటున కూడా ఈ మొక్కను మీ ఇంట్లో పెంచకండి.. అది మీ ఇంటి శాంతికి భంగం..!

వాస్తు ప్రకారం కొన్ని రకాల చెట్లు, మొక్కలను ఇంట్లో పెంచుకోవటం అశుభం అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. కానీ, మనకు తెలియకుండా వాటిని నాటడం సమస్యలకు దారి తీస్తుంది. అందులో గోరింట మొక్క ఒకటి. గోరింట ఎప్పుడూ ఇంటి లోపల నాటకూడదని అంటారు. ఇది చాలా అరిష్టంగా చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పొరపాటున కూడా ఈ మొక్కను మీ ఇంట్లో పెంచకండి.. అది మీ ఇంటి శాంతికి భంగం..!
Henna Plant
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 15, 2023 | 1:33 PM

ఇల్లు ఆకర్షణీయంగా, అందంగా కనిపించేందుకు ప్రజలు అనేక రకాల చెట్లను, మొక్కలను నాటుతుంటారు. ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా, సానుకూలంగా ఉంటుంది. కానీ, వాస్తు ప్రకారం కొన్ని రకాల చెట్లు, మొక్కలను ఇంట్లో పెంచుకోవటం అశుభం అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. కానీ, మనకు తెలియకుండా వాటిని నాటడం సమస్యలకు దారి తీస్తుంది. అందులో గోరింట మొక్క ఒకటి. గోరింట ఎప్పుడూ ఇంటి లోపల నాటకూడదని అంటారు. ఇది చాలా అరిష్టంగా చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అరచేతులకు గోరింటాకు పెట్టుకోవటం శుభప్రదంగా పరిగణిస్తారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో గోరింటాకు రుబ్బుకుని చేతులకు పెట్టుకోవడం ఆనవాయితీ. పెళ్లయిన ఆడవాళ్ళకి పెట్టే పదహారు అలంకారాలలో గోరింట ఒకటి. అయితే గోరింటను చేతులకు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఇంట్లో పెంచుకుంటే కూడా అంతే అశుభం అని మీకు తెలుసా? వాస్తు ప్రకారం గోరింట మొక్క శుభమా..? అశుభమా? అన్న విషయానికి వస్తే..

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గోరింట చెట్టును నాటడం చాలా అశుభం అంటున్నారు. దీని సువాసన అందరినీ ఆకర్షిస్తుంది. కానీ హెన్నా మొక్కకు ప్రతికూల శక్తులు ఉన్నాయని నమ్ముతారు. గోరింట మొక్క ఎక్కడ నాటితే అక్కడ నెగెటివ్ ఎనర్జీ నిండిపోతుంది అంటారు. ఇది ఇంటి ఆనందం, శాంతిపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి, గోరింట మొక్కను ఎప్పుడూ ఇంటి లోపల నాటకూడదు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం:

ఇంట్లో హెన్నా చెట్టును నాటడం ద్వారా ఆ ఇంట్లోని వ్యక్తులు ఎల్లప్పుడూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లోని ప్రతి సభ్యుడు ఒక్కొక్కరుగా అనారోగ్యం పాలవుతుంటారు. కాబట్టి, గోరింట చెట్టును ఎప్పుడూ ఇంటి లోపల కాకుండా దూరంటా నాటుకోవాలి.

ఇంట్లో అసమ్మతి:

పొరపాటున కూడా ఇంట్లో హెన్నా మొక్కను నాటకూడదు. దీని కారణంగా, ఇంట్లో ఎప్పుడూ విభేదాలు ఏర్పడుతుంటాయి. ఇది వ్యక్తి మనశ్శాంతిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి గోరింట చెట్టును నాటడం మానుకోండి.

గోరింట చెట్లను నాటడం పురోగతిని అడ్డుకుంటుంది:

గోరింట చెట్లను నాటడం వల్ల ఆ వ్యక్తి పనిలో అడ్డంకులను సృష్టిస్తుంది. అతని జీవితంలో పురోగతిని కూడా నిలిపివేస్తుంది. కాబట్టి, మీ ఇంట్లో గోరింట చెట్టు ఉంటే, ఈరోజే దాన్ని వదిలించుకోండి. దీనివల్ల మీరు సంతోషంగా ఉండలేరు.

Note: (వాస్తు వివరాలు, రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..