Viral: విమానంలో బోను నుంచి తప్పించుకున్న గుర్రం.. తర్వాత ఏమైందంటే..!
జంతువులను తరలించే ఓ విమానంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. బోను నుంచి ఓ గుర్రం తప్పించుకుంది. దాంతో విమానంలో గందరగోళం నెలకొంది. ఎయిర్ అట్లాంటా ఐస్‌లాండిక్ కు చెందిన బోయింగ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే (JFK) నుంచి బెల్జియం కు బోయింగ్ 747 విమానం బయలుదేరింది. దానిలో ఒక గుర్రాన్ని కూడా రవాణా చేస్తున్నారు.
జంతువులను తరలించే ఓ విమానంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. బోను నుంచి ఓ గుర్రం తప్పించుకుంది. దాంతో విమానంలో గందరగోళం నెలకొంది. ఎయిర్ అట్లాంటా ఐస్‌లాండిక్ కు చెందిన బోయింగ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే (JFK) నుంచి బెల్జియం కు బోయింగ్ 747 విమానం బయలుదేరింది. దానిలో ఒక గుర్రాన్ని కూడా రవాణా చేస్తున్నారు. టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత బోను నుంచి గుర్రం తప్పించుకుని అందులోనే తిరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. గుర్రం ఒక్కసారిగా బయటకు దూకడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. గుర్రం బయటకు వచ్చిన విషయాన్ని సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. విమానం బరువు ఎక్కువగా ఉండడంతో 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్ సముద్రంలో డంప్ చేయాల్సి వచ్చిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు, విమానాన్ని తిరిగి న్యూయార్క్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానాశ్రయ సిబ్బంది గుర్రాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గుర్రానికి గాయాలైనట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి ఓ ఘటన ఇరాకీ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో చోటు చేసుకుంది. ఓ ఎలుగుబంటి పెట్టెలోంచి బయటకు వచ్చి హాయిగా చక్కర్లు కొట్టింది. దీంతో విమానం తిరుగు ప్రయాణం ఆలస్యం కావడంతో ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.