AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినొద్దు.. అవేంటో తెలుసుకోండి.. లేదంటే ప్రమాదంలో పడినట్టే..!

ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి ఆకలిగా ఉంటుంది..దాంతో ఏదో ఒకటి తినేసి ఆకలి తీర్చుకుంటుంటారు. కానీ, అలా కడుపు నింపుకోవడానికి బదులుగా ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలపై దృష్టి సారించడం మంచిది.. ఏదో తినాలి కాబట్టి తిన్నామనుకుంటే..ఆరోగ్య సమస్యలతో బాధపడటం తప్పదని గుర్తుంచుకోవాలి. అందుకే ఉదయం పూట ఖాళీ కడుపుతో అస్సలు తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినొద్దు.. అవేంటో తెలుసుకోండి.. లేదంటే ప్రమాదంలో పడినట్టే..!
Avoid On Empty Stomach
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2023 | 7:21 AM

Share

శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం తినే ఆహారం అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మన శరీరానికి సరైన పోషకాహారం అందుతుంది. అందుచేత మనం ఉదయం తీసుకునే ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, వ్యాధులను దూరం చేయడంపై చాలా ప్రభావం చూపుతుంది. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ పదార్థాలు మీ జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి. అందుకే ఉదయం పూట ఖాళీ కడుపుతో అస్సలు తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి ఆకలిగా ఉంటుంది..దాంతో ఏదో ఒకటి తినేసి ఆకలి తీర్చుకుంటుంటారు. కానీ, అలా కడుపు నింపుకోవడానికి బదులుగా ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలపై దృష్టి సారించడం మంచిది.. ఏదో తినాలి కాబట్టి తిన్నామనుకుంటే..ఆరోగ్య సమస్యలతో బాధపడటం తప్పదని గుర్తుంచుకోవాలి.

1. ప్రాసెస్ చేసిన మాంసం, స్పైసీ ఫుడ్స్

ఇవి కూడా చదవండి

ఉదయం ఖాళీ కడుపుతో మాంసాన్ని తినకూడదు. నిజానికి, సాసేజ్, బేకన్ వంటి కొవ్వు మాంసాలలో తరచుగా సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి హానికరం. అలాగే, ఉదయం పూట స్పైసీ ఫుడ్స్ కూడా తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. వీటితో కడుపులో ఆమ్ల ప్రతిచర్యలు కలిగే అవకాశం ఉంటుంది. తిమ్మిర్లు వంటివి కలుగుతాయి. అలాగే, రోజంతా మీ ఆరోగ్యాన్ని ఇబ్బందిలో పడవేస్తుంది.

2. తీపి పదార్థాలు, పానీయాలు..

పండ్లు ఆరోగ్యానికి మంచివే. పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు తక్షణనిస్తాయి. కానీ వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. ఉదయం పూట పంచదార ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం మంచిది కాదు. ఉదయం ఖాళీ కడుపుతో స్వీట్లు, చాక్లెట్లను తినకుండా చూసుకోవాలి. వీటిలో చక్కెర కంటెంట్ ఇన్సులిన్ స్థాయిలను వెంటనే పెరిగేలా చేస్తుంది. తర్వాతి రోజుల్లో ప్యాంక్రియాస్‌కు హాని కలిగిస్తుంది. అందుకే చక్కెరతో యారు చేసిన స్వీట్స్‌ వంటివి అల్ఫాహారంలో చేరకుండా చూసుకోవటం మంచిది.

3. నూనె ఆహార పదార్థాలు..

పెద్దలు అయినా, పిల్లలు అయినా అందరూ వేయించిన, ఎక్కువ నూనెతో తయారు చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో సమోసాలు, పకోడీలు, పూరీలు వంటివి తినడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, మీ రోజును ఆరోగ్యకరమైన విషయాలతో ప్రారంభించండం మంచిది.

4. శుద్ధి చేసిన చక్కెర..

శుద్ధి చేసిన చక్కెర అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం మీ శరీరానికి మంచిది కాదు. కాబట్టి, ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోకుండా ఉండండి. అలాగే, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ జాతి పండ్లను కూడా ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. వీటిలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్, ఫ్రక్టోజ్ జీవక్రియలను నెమ్మదించేలా చేస్తాయి. అలాగే, కడుపు సమస్యలు, గుండెల్లో మంటను కలిగిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..
చిటికెడు పొడితో.. బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!
చిటికెడు పొడితో.. బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి!
చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే
OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!
మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!
అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?
అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?
బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త
బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త
చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!
చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!