Hair Care Tips: తలస్నానం చేసే ముందు జుట్టుకు నూనె అప్లై చేస్తున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి

జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాస్తే జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది అనేక జుట్టు సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ రోజూ జుట్టుకు ఆయిల్ పూసుకోవడం చాలా మందికి కుదరదు. అందుకే చాలా మంది తలస్నానం చేసే ముందు జుట్టుకి నూనె పూసుకుంటారు. షాంపూ చేసే ముందు నూనె రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో నిపుణుల మాటల్లో మీకోసం.. ఆయిల్ మసాజ్ చేయడం వల్ల జుట్టు చిట్లకుండా

Srilakshmi C

|

Updated on: Nov 16, 2023 | 8:14 PM

జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాస్తే జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది అనేక జుట్టు సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ రోజూ జుట్టుకు ఆయిల్ పూసుకోవడం చాలా మందికి కుదరదు. అందుకే చాలా మంది తలస్నానం చేసే ముందు జుట్టుకి నూనె పూసుకుంటారు. షాంపూ చేసే ముందు నూనె రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో నిపుణుల మాటల్లో మీకోసం.. ఆయిల్ మసాజ్ చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది. జుట్టు క్యూటికల్‌ను స్మూత్ చేస్తుంది. చలికాలంలో డ్రై హెయిర్ సమస్య సర్వసాధారణం. కానీ జుట్టుకు నూనె రాసుకోవడం ద్వారా ఈ సమస్య సులభంగా తొలగిపోతుంది.

1 / 5
ప్రాచీన కాలం నుంచి వేపను సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. జుట్టు రాలడాన్ని నివారించడంలో వేపనూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేపలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వేప నూనె స్కాల్ప్‌పై అదనపు నూనె ఉత్పత్తిని నిలిపివేస్తుంది. జుట్టు మూలాలను బలపరుస్తుంది.

2 / 5
పొడి స్కాల్ప్ చుండ్రు సమస్యను పెంచుతుంది. చలికాలంలో ఈ సమస్య తీవ్రమవుతుంది. కానీ నూనెను మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడి శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. వీలైతే రోజూ జుట్టుకు నూనెతో మసాజ్ చేసుకోవాలి. లేదంటే షాంపూ చేయడానికి కనీసం 30 నిమిషాల ముందు నూనె రాసుకోవాలి.

3 / 5
జుట్టు సంరక్షణకు సరైన నూనెను ఎంచుకోవడం చాలా అవసరం. సరైన నూనె ఎంచుకోలేకపోతే, కొబ్బరి నూనె జుట్టుకు పూసుకోవచ్చు. హెర్బల్ కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అత్యంత ప్రభావవంతమైనది.

4 / 5
తగినంత కొబ్బరి నూనె ఒక గిన్నెలో తీసుకుని కొద్దిగా వేడి చేసుకోవాలి. గోరు వెచ్చని కొబ్బరి నూనెను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు మూలాలు బలోపేతం అవుతాయి. దీంతో జుట్టు సమస్యలు తగ్గుతాయి.

5 / 5
Follow us