ఇదో అంతుచిక్కని మాయ..! ఆ ఆలయంలో సూర్యకాంతితో సంబంధం లేకుండానే కనిపించే నీడ..!! ఈ కార్తీకం మరింత..
ఒకే నీడ రెండు స్తంబాలకు మధ్యలో ఉండే గర్బగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఎంతోమంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని పరిశీలించి అంత చిక్కని రహస్యాన్ని మాత్రం చేధించలేకపోయారు. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా ఉంది. ఆలయంలోని మూడు గర్బ గుడులు ఒకేరీతిగా ఉంటాయి. అయితే, పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపించడం.. ఇది దేవుడి మాయ అని భక్తులు నమ్ముతున్నారు.
నల్లగొండ,నవంబర్17; సూర్య కాంతి, వెలుతురుతోనే నీడ సాధ్యం. సాధారణంగా ‘నీడ’ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. ఆ నీడ సూర్యుని గమనంతోపాటు మారుతూ ఉండడం సహజం. అలాంటి నీడను సూర్యని కదలికతో సంబందం లేకుండా ఒకే చోట ఒకే నీడలా బంధించడం సాధ్యమవుతుందా..? అలాంటి ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయంలో మాత్రం గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంబాలున్నా.. సూర్యరశ్మితో సంభంధం లేకుండా అన్ని వేళలా ఒకే స్తంభాకార నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు రోజంతా ఆ నీడ కదలకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది. భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ అంతు చిక్కని రహస్యం దాగిన వింత ఆలయం ఎక్కడ ఉందో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
భారతీయ వాస్తు శిల్పకళాలంటే , శిల్పకళా చాతుర్యములో సాంకేతిక విజ్ఞానాన్ని మిళితంచేసి ఆలనాటి కాకతీయులు, కుందూరు చోళులు దేవాలయాల నిర్మాణ శైలిలో అద్భుతాలు సృష్టించారు. నల్లగొండ సమీపాన పానగల్ లోనీ శ్రీ ఛాయా సోమేశ్వరాలయాన్ని 800 ఏళ్ల క్రితం కందూరు చాళుక్య రాజైన ఉదయ భానుడును నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. మూడు గర్బాలయాలతో ఈ ఆలయం త్రికూటాలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో పడమర వైపున ఉన్న గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంబాలున్నా.. గర్బగుడిలోని శివలింగం మీదుగా నీడ కనిపిస్తుంది. ఈ నీడ వెలుతురు ఉన్నంత సేపు ఒకే చోట నిశ్చల స్థితిలో ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు కనిపించదు. ఈ నీడ సూర్యుడి వెలుతురుతో సంబంధం లేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని రెండు స్తంబాల్లో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా.. ఒకే నీడ రెండు స్తంబాలకు మధ్యలో ఉండే గర్బగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఎంతోమంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని పరిశీలించి అంత చిక్కని రహస్యాన్ని మాత్రం చేధించలేకపోయారు. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా ఉంది. ఆలయంలోని మూడు గర్బ గుడులు ఒకేరీతిగా ఉంటాయి. అయితే, పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపించడం.. ఇది దేవుడి మాయ అని భక్తులు నమ్ముతున్నారు.
ఈ ఆలయం ఆలనాటి రాజుల..
ఇంజనీరింగ్, అద్భుత నిర్మాణ శైలికి, ప్రజ్ఞాపాటవాలకు తార్కాణం. ప్రపంచంలో ఇలాంటి నిర్మాణం మరెక్కడా లేదని చరిత్ర చెబుతోంది. ఆనాటి రాజుల కళాతృష్ణకు, శిల్పుల అపార మేథాసంపత్తికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ ఆలయం నిలుస్తోందని చరిత్రకారులు చెబుతున్నారు. భారతీయ ప్రాచీన సాంస్కృతిక సంపదగా వెలుగుతున్న ఆ అపూర్వ నిర్మాణం శ్రీ ఛాయా సోమేశ్వరాలయం అని చరిత్ర పేర్కొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..