Fenugreek Side Effects: మంచి మాత్రమే కాదు చెడు కూడా.. వారు మెంతులు అస్సలు తినొద్దు.. ఎందుకంటే..

మెంతులు కేవలం చక్కెర తగ్గించడానికి తీసుకోవడం మాత్రమే కాదు. అధిక రక్తపోటు ఉన్న రోగులకు కూడా ఇది హానికరం. మెంతులు ఎక్కువగా తీసుకుంటే, అది శరీరంలో సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. ఇది బిపిని పెంచుతుంది. అందుకే అధిక రక్తపోటు ఉన్న రోగులు మెంతులు తీసుకోకుండా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి.

Fenugreek Side Effects: మంచి మాత్రమే కాదు చెడు కూడా.. వారు మెంతులు అస్సలు తినొద్దు.. ఎందుకంటే..
Fenugreek Seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 17, 2023 | 8:48 AM

Fenugreek Side Effects: చలికాలం వచ్చిందంటే మెంతికూర పరోటా తినేవారు ఎక్కువగా ఉంటారు. వేడి వేడి మెంతికూర పరోటా చాలా మందికి ఇష్టం.. మెంతికూర ఆరోగ్యానికి కూడా మంచిది. దీనిని ఉపయోగించడం ద్వారా అనేక రకాల వ్యాధులు నయమవుతాయి. మెంతులు శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మెంతులు, మెంతికూరలో ఫైబర్, ప్రొటీన్, కొవ్వు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. కడుపు సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులను కూడా దూరం చేస్తాయి. కానీ, అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుందనే నానుడి ప్రకారం.. మెంతులు కూడా ఎక్కువగా తీసుకోవటం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు ఇది శరీరానికి హానికలిగిస్తుందని అంటారు.

మెంతులు శరీరంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి గింజలను నానబెట్టి ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అయితే మెంతి గింజలను నానబెట్టకుండా తింటే, వాటిలోని పోషకాలు షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. ఎక్కువ చక్కెర లోపం కూడా ప్రమాదకరం.

మెంతులు కేవలం చక్కెర తగ్గించడానికి తీసుకోవడం మాత్రమే కాదు. అధిక రక్తపోటు ఉన్న రోగులకు కూడా ఇది హానికరం. మెంతులు ఎక్కువగా తీసుకుంటే, అది శరీరంలో సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. ఇది బిపిని పెంచుతుంది. అందుకే అధిక రక్తపోటు ఉన్న రోగులు మెంతులు తీసుకోకుండా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మెంతులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తులకు హానికరం. మెంతులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి.

గర్భిణీ స్త్రీలు కూడా మెంతులు తీసుకోవడం మానుకోవాలి. ఇది గర్భధారణ సమయంలో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఇది కడుపు నొప్పికి కారణం కావచ్చు. అందుకే గర్భిణీలు మెంతులు తీసుకోవడం వీలైనంత తగ్గించాలి

మెంతులు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం దుర్వాసన వస్తుంది. మెంతులు పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతులు ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!