Telangana Election: ప్రచారంలో డోస్ పెంచిన గులాబీ బాస్.. అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు సిద్ధం కావాలని పిలుపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరింత డోస్ పెంచారు గులాబి బాస్ కేసీఆర్. భారీతీయ జనతా పార్టీ అంటే మత పిచ్చి, కాంగ్రెస్‌ అంటే మోసపూరితమన్న కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికలకు సైతం ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలంటూ పిలుపునిచ్చారు.

Telangana Election: ప్రచారంలో డోస్ పెంచిన గులాబీ బాస్.. అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు సిద్ధం కావాలని పిలుపు
Cm Kcr On National Politics
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 17, 2023 | 9:18 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరింత డోస్ పెంచారు గులాబి బాస్ కేసీఆర్. భారీతీయ జనతా పార్టీ అంటే మత పిచ్చి, కాంగ్రెస్‌ అంటే మోసపూరితమన్న కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికలకు సైతం ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలంటూ పిలుపునిచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఫిక్ స్టేజీకి చేరుకుంటుంది. అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచారు. రాష్ట్ర నేతలతో పాటు జాతీయ పార్టీలకు చెందిన నాయకులంతా తెలంగాణ బాటపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచారు గులాబీ బాస్ కేసీఆర్. సామెతలు, సెటైర్లతోనే కాకుండా కాస్త ఢిపెరంట్‌గా డోస్‌ పెంచి సెంటిమెంట్‌ను జోడించారు. జాతీయ పార్టీల తీరును పూర్తిగా ఎండగట్టారు కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ప్రచార సభల్లో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందంటూ విమర్శించారు. నిన్నటి వరకు రైతు బంధు, ధరణి, కరెంట్ సెంట్రిక్‌ గా సాగిన ప్రచారం జాతీయ రాజకీయల వైపు మారింది.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని.. 58ఏళ్లు హరిగోస పడ్డామని ఆరోపించారు కేసీఆర్. తెలంగాణ బిడ్డల చావుకు కాంగ్రెస్‌కే కారణమంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటుందని, సెక్యులరిజం పార్టీ అని చెప్పారు కేసీఆర్. ఉద్యమ సమయంలో చేసిందంతా చేసి, ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు కేసీఆర్.

అంతేకాకుండా జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఈసారి కేంద్రంలో సంకీర్ణం ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ప్రజలు ప్రిపేర్ కావాంటూ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే తెలంగాణ కలలు సాకరమవుతాయని చెప్పారు కేసీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…