Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: అయ్యో పాపం..! టీమిండియా గెలవాలని స్విగ్గీలో 51 కొబ్బరికాయలు ఆర్డర్ ఇచ్చిన అభిమాని..చివరకు

ఓ అభిమాని ఇండియా గెలిస్తే దేవుడికి 51 కొబ్బరి కాయలు కొడతానని మొక్కుకున్నాడట. అందుకోసం కావాల్సిన కొబ్బరికాయలను అతడు ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. 51 కొబ్బరి కాయలను అతడు స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చాడు. ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్విగ్గీయే ఈ విషయాన్ని వెల్లడించింది. Swiggy ఈ ఆసక్తికరమైన వార్తను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో షేర్ చేసింది. ఆ తర్వాత ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ తర్వాత సదరు క్రికెట్‌ అభిమాని కూడా తానే స్వయంగా ముందుకు వచ్చి తాను ఇన్ని కొబ్బరికాయలు ఎందుకు ఆర్డర్ చేశానో చెప్పాడు.

World Cup 2023: అయ్యో పాపం..! టీమిండియా గెలవాలని స్విగ్గీలో 51 కొబ్బరికాయలు ఆర్డర్ ఇచ్చిన అభిమాని..చివరకు
Coconuts From Swiggy
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 21, 2023 | 5:11 PM

నవంబర్‌ 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచినప్పటికీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు కప్పు గెలవలేకపోయింది. భారత్ బ్యాటింగ్ చేసి 240 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే, దేశ విజయం కోసం ప్రజలు రకరకాల పూజలు, ప్రార్థనలు, విన్యాసాలు చేశారు. కొందరు అగరుబత్తీలు ఆర్డర్ చేయగా, మరికొందరు కొబ్బరికాయలు కొన్నారు. మ్యాటర్ ఏంటంటే.. ముంబైలోని ఓ వ్యక్తి ఈ మ్యాచ్ కోసం స్విగ్గీ నుంచి 51 కొబ్బరికాయలను ఆర్డర్ చేశాడట.

ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత జట్టు విజయం తథ్యమని భావించిన ఓ క్రికెట్‌ అభిమాని ఆన్‌లైన్‌లో ఎక్కువ మొత్తంలో కొబ్బరికాయలు ఆర్డర్‌ చేశాడు. మహారాష్ట్రలోని థానేలో ఓ అభిమాని ఇండియా గెలిస్తే దేవుడికి 51 కొబ్బరి కాయలు కొడతానని మొక్కుకున్నాడట. అందుకోసం కావాల్సిన కొబ్బరికాయలను అతడు ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. 51 కొబ్బరి కాయలను అతడు స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చాడు. ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్విగ్గీయే ఈ విషయాన్ని వెల్లడించింది. ఎవరో థానే నుంచి ఇప్పుడే 51 కొబ్బరి కాయలకు ఆర్డర్ ఇచ్చారు. Swiggy ఈ ఆసక్తికరమైన వార్తను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో షేర్ చేసింది. ఆ తర్వాత ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ తర్వాత సదరు క్రికెట్‌ అభిమాని కూడా తానే స్వయంగా ముందుకు వచ్చి తాను ఇన్ని కొబ్బరికాయలు ఎందుకు ఆర్డర్ చేశానో చెప్పాడు.

గోర్డాన్ అనే వినియోగదారు ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేసి రిప్లై ఇచ్చారు.. అవును బ్రో.. నేనే.. థానేకు చెందిన నేను ఆన్‌లైన్‌లో 51 కొబ్బరికాయలు తీసుకున్నాను. అని రాశారు. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు వెంటనే స్పందించడం ప్రారంభించారు. కొంతమంది థానే నివాసిని ప్రశంసించారు. చాలా మంది చాలా రకాలుగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

ఇకపోతే, క్రికెట్‌ వీరాభిమానులు ఇలాంటి విన్యాసాలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా భారతదేశం గెలవాలని ఆశిస్తూ.. ఒక వ్యక్తి 240 అగరబత్తులు ఆర్డర్ చేశాడు. భారత జట్టు విజయం కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రార్థనలు చేశారు. అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..