AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: నేటి ప్రేమ టైమ్ పాస్ కోసమే.. 400 మంది పురుషులు ప్రపోజ్ చేసినా నిజమైన ప్రేమ దొరకలేదన్న 55 ఏళ్ల మహిళ

ఎంత అన్వేషించినా సరే తమకు నచ్చిన భాగస్వామిని కనుగొనలేకపోతున్నారు. ప్రస్తుతం ఓ మహిళ వార్తల్లో నిలిచింది.  55 సంవత్సరాల వయస్సులోనూ నిజమైన ప్రేమ కోసం వెతుకుతోంది.. ఇప్పటికీ దొరకడం లేదు. ఆమెను పురుషులు ఇష్టపడరని కాదు.. వందల మంది అబ్బాయిలు ఆమెకు ప్రపోజ్ చేశారు.. అయినప్పటికీ ఆమె ఇప్పటికి ఒంటరిగానే ఉంది. 

Viral News: నేటి ప్రేమ టైమ్ పాస్ కోసమే.. 400 మంది పురుషులు ప్రపోజ్ చేసినా నిజమైన ప్రేమ దొరకలేదన్న 55 ఏళ్ల మహిళ
Fran Sawyer
Surya Kala
|

Updated on: Nov 12, 2023 | 11:11 AM

Share

ప్రస్తుతం నిజమైన ప్రేమను కనుగొనడం చాలా కష్టమని అంటున్నారు నేటి యువత. ఇంటర్నెట్ యుగం నడుస్తోంది ప్రస్తుతం. నెట్టింట్లో పరిచయాల ద్వారా ఎక్కువగా టైమ్ పాస్ ప్రేమను పొందుతున్నారు. ఈ ప్రేమ కొన్ని నెలలు లేదా  సంవత్సరాల పాటు కొనసాగుతుంది. తరువాత జంట బ్రేకప్ చెప్పేసి వేర్వేరు మార్గాల్లో వెవెళ్తున్నారు. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు నిజమైన ప్రేమ కోసం అన్వేషణ సంవత్సరాలుగా కొనసాగడానికి ఇదే కారణం. అయితే ఎంత అన్వేషించినా సరే తమకు నచ్చిన భాగస్వామిని కనుగొనలేకపోతున్నారు. ప్రస్తుతం ఓ మహిళ వార్తల్లో నిలిచింది.  55 సంవత్సరాల వయస్సులోనూ నిజమైన ప్రేమ కోసం వెతుకుతోంది.. ఇప్పటికీ దొరకడం లేదు. ఆమెను పురుషులు ఇష్టపడరని కాదు.. వందల మంది అబ్బాయిలు ఆమెకు ప్రపోజ్ చేశారు.. అయినప్పటికీ ఆమె ఇప్పటికి ఒంటరిగానే ఉంది.

ఆ మహిళ పేరు ఫ్రాన్‌ సాయర్‌. మిర్రర్ పత్రిక నివేదిక ప్రకారం ఇప్పటివరకు 400 మందికి పైగా పురుషులు తనకు పెళ్లికి ప్రతిపాదించారని ఫ్రాన్ పేర్కొన్నది. అయితే ఆమె వారందరికీ నో చెప్పింది..  తనకు ప్రపోజ్ చేసిన వారిలో 18 ఏళ్ల అబ్బాయిల నుంచి 35-40 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, వృద్ధులు కూడా ఉన్నారని చెప్పింది. అయితే తనతో 18-21 ఏళ్ల అబ్బాయిలు సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరికతోనే ఉన్నారు.. అంతేకాని వారికి తన పట్ల ప్రేమ లేదని ఫ్రాన్ చెప్పింది.

ఆన్‌లైన్ డేటింగ్ యాప్

ఫ్రాన్ తన మిస్టర్ రైట్‌ను కనుగొనడానికి అనేక ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లను కూడా ఉపయోగించానని.. అయినా ఎటువంటి ప్రయోజనం లేదని వెల్లడించింది. మొదట్లో మగవాళ్లంతా సరిగ్గా మాట్లాడతారని..  అయితే కొద్ది రోజుల్లోనే వాళ్ల ఎక్స్‌ప్రెషన్స్‌ మారిపోతాయని చెప్పింది. వారి మాటల తీరుతో తనతో  సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే మానసిక స్థితిలో లేరని.. కేవలం సమయం గడపడానికి మాత్రమే తనతో మాట్లాడుతున్నారని తనకు అర్ధం అయిందని వెల్లడించింది. అటువంటి పరిస్థితిలో తాను రిలేషన్‌షిప్‌లో వెనక్కి తగాల్సి వస్తుందని ఫ్రాన్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మగాళ్లకు ఎలా మాట్లాడాలో తెలియదన్న ఫ్రాన్

కొన్ని మీడియా కథనం ప్రకారం చాలా మంది పురుషులకు సోషల్ మీడియాలో అమ్మాయిలతో లేదా  మహిళలతో ఎలా మాట్లాడాలో తెలియదని.. ఎలా ప్రవర్తించాలో తెలియదని ఫ్రాన్ చెప్పారు. ఎదుటివారి  మనోభావాలను గౌరవించరని సోషల్ మీడియా ఏదో ఒకరోజు నిజమైన ప్రేమను నాశనం చేస్తుందని చెప్పింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..