Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మ ప్రేమ ఇంతే మరి.. తల్లి వీపు తనయుడికి సింహాసనం.. హృదయం ద్రవించే వీడియో వైరల్

జీవితం మనకు కనిపించినంత సులువు కాదని అంటారు. చాలా సార్లు మనం ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం.. జీవితాన్ని నడపడం కోసం చాలా కష్టపడాలి. పేదరికం చాలా క్రూరమైనది అని ఎవరో సరిగ్గా చెప్పారు..! పేదరికం కొందరిని మరణం వరకు విడిచిపెట్టదు. తన పరిస్థితితో సంబంధం లేకుండా కష్టపడి పని చేస్తారు. వీరి లక్ష్యం డబ్బు సంపాదన మాత్రమే.

Viral Video: అమ్మ ప్రేమ ఇంతే మరి.. తల్లి వీపు తనయుడికి సింహాసనం.. హృదయం ద్రవించే వీడియో వైరల్
Mother Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 09, 2023 | 10:34 AM

ప్రపంచంలో అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదు. ఆమెను ఎవరితోనూ పోల్చలేము. ఈ ప్రపంచంలో పిల్లలను ఎక్కువగా ప్రేమించే తల్లి.. తన పిల్లలు ఎలాంటి కష్టాల్లో ఉన్నా.. పిల్లలను ఆ దుర్భర పరిస్థితుల నుంచి దూరంగా ఉంచాలన్నదే తల్లి కోరిక. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరి హృదయం అయినా ద్రవిస్తుంది. కళ్లు చెమరుస్తాయి.

జీవితం మనకు కనిపించినంత సులువు కాదని అంటారు. చాలా సార్లు మనం ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం.. జీవితాన్ని నడపడం కోసం చాలా కష్టపడాలి. పేదరికం చాలా క్రూరమైనది అని ఎవరో సరిగ్గా చెప్పారు..! పేదరికం కొందరిని మరణం వరకు విడిచిపెట్టదు. తన పరిస్థితితో సంబంధం లేకుండా కష్టపడి పని చేస్తారు. వీరి లక్ష్యం డబ్బు సంపాదన మాత్రమే. ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక మహిళ ఊతకర్రల మీద నడుస్తూ అడుక్కుంటోంది. ఆ సమయంలో కూడా ఆ మహిళ తన బిడ్డను విడిచి పెట్టలేదు.

ఇవి కూడా చదవండి

ఓ వికలాంగురాలు రోడ్డుపై ఊతకర్రల సాయంతో నడుస్తోన్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. స్వతహాగా ఆ మహిళ నిటారుగా నిలబడలేని పరిస్థితి. అయితే ఆ మహిళ వీపు మీద పిల్లను పెట్టుకుంది. అప్పుడు ఆ చిన్నారి పుచ్చకాయ ఆనందంగా తింటోంది. ఇంతలో ఆ మహిళకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు.

ఈ వీడియో @RobertLyngdoh2 అనే ఖాతా Xలో షేర్ చేశారు. 80 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు.. ఇది చూసిన తర్వాత మీ గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని క్యాప్షన్ కూడా ఇచ్చారు. నరకం నుండి బయటపడవచ్చు .. అయితే భూమిపై పేదరికమే నిజమైన నరకం అని కొందరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..