Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విచిత్రమైన కిడ్డీ బ్యాంక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ను మన ఇళ్లలో వంటకు ఉపయోగిస్తారు. మరి కొందరు దీని ద్వారా వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు. మరి కొందరు మీసాలకు కట్టుకొని నిండు సిలిండర్‌ను ఎత్తడం లాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్‌ను కిడ్డీ బ్యాంకుగా ఉపయోగించాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదెలా అనే సందేహం మీలో కలుగవచ్చు. ఇలా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ఒకరు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: విచిత్రమైన కిడ్డీ బ్యాంక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
Video Of An Lpg Gas Cylinder Used As A Kiddy Bank Has Viral
Follow us
Srikar T

|

Updated on: Nov 09, 2023 | 4:50 PM

ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ను మన ఇళ్లలో వంటకు ఉపయోగిస్తారు. మరి కొందరు దీని ద్వారా వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు. మరి కొందరు మీసాలకు కట్టుకొని నిండు సిలిండర్‌ను ఎత్తడం లాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్‌ను కిడ్డీ బ్యాంకుగా ఉపయోగించాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదెలా అనే సందేహం మీలో కలుగవచ్చు. ఇలా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ఒకరు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మన సమాజంలో చాలా మంది డబ్బులు పొదుపు చేస్తూ ఉంటారు. దీని కోసం చిన్న పిల్లలైతే మట్టితో, ప్లాస్టిక్‌తో చేసిన చిన్న హుండీలను కొనుగోలు చేస్తూ ఉంటారు. వాటిని నిండిన తరువాత పగుల గొట్టి జ్ఞాపకార్థంగా వస్తువును కొంటూ ఉంటారు. కానీ కొంతమంది సొంతంగా కిడ్డీ బ్యాంకులను తయారు చేస్తున్నారు. స్టీల్ బాక్సుల్లో, చిన్నె తాళం వేసే పెట్టెల్లో నాణేలు, నోట్లు దాస్తూ ఉంటారు.కానీ అలాంటి వింతైన కిడ్డీ బ్యాంకు ఎప్పుడూ చూసి ఉండరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఒక వ్యక్తి LPG సిలిండర్‌ను డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంక్‌గా మార్చాడు. అందులో నాణేలు వేసి, సిలిండర్ కట్ చేసి తెరిచి చూస్తే నాణేల రాశి కనిపించింది. వైరల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో, ఒక వ్యక్తి సిలిండర్ పై భాగాన్ని కత్తిరించడం మనం చూడవచ్చు. దాని నుండి ఉత్పన్నమయ్యే స్పార్క్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీని తర్వాత రూ.10 నాణేలతో నింపిన సిలిండర్ మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి సిలిండర్‌ని తిప్పి నాణేలన్నీ నేలపై చెల్లాచెదురుగా వేశాడు. ఇప్పుడు దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలా కామెంట్లు చేస్తున్నారు. ఈ విచిత్రమైన హుండీ నుంచి ఎంత డబ్బు జమ అయిందో అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే 7 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్‌తో పాటూ 26 లక్షల లైక్‌లను పొందింది. చాలా మంది దీని ధర ఎంత అని కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..