Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: పెళ్లి చేసుకోండి.. పిల్లల్ని కనండి ప్లీజ్‌.. చైనా యువతకు అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు.

China: పెళ్లి చేసుకోండి.. పిల్లల్ని కనండి ప్లీజ్‌.. చైనా యువతకు అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు.

Anil kumar poka

|

Updated on: Nov 08, 2023 | 9:09 PM

చైనా అధ్యక్షుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అమ్మాయిలు.. ప్లీజ్‌ పెళ్లి చేసుకోండి. చక్కగా పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనండి.. అంటూ ఆ దేశ యువతను వేడుకుంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండటంతో, అభివృద్ధికి ఆమడదూరంలోకి వెళ్లిపోతామని ఆయన భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే దేశంలోని యువతులంతా పెళ్లి చేసుకోవాలని మరోమారు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు.

చైనా అధ్యక్షుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అమ్మాయిలు.. ప్లీజ్‌ పెళ్లి చేసుకోండి. చక్కగా పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనండి.. అంటూ ఆ దేశ యువతను వేడుకుంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండటంతో, అభివృద్ధికి ఆమడదూరంలోకి వెళ్లిపోతామని ఆయన భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే దేశంలోని యువతులంతా పెళ్లి చేసుకోవాలని మరోమారు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో జిన్‌పింగ్‌ యువతులు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. చైనాలో శిశుజననాల రేటు భారీగా తగ్గింది. మరోవైపు చైనా యువతులు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంలో మహిళలదే కీలకపాత్ర అని అన్నారు. సమాజంలో కొత్త ఒరవడిని నెలకొల్పడంలో మహిళలు ముందుంటారని పేర్కొన్నారు. దేశంలో వివాహాలు, సంతాన సాఫల్యత అనే నూతన సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 2022లో చైనా సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోయి 1.09కి చేరుకుంది. దేశంలో పిల్లలు లేని జంటల సంఖ్య రెండింతలు పెరిగింది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం దేశంలో పిల్లలు లేని జంటల వాటా 2017-2022 మధ్య 20.6 శాతం నుండి 43.2 శాతానికి చేరుకుని, రెండింతలు పెరిగింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు దేశంలోని యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.