Viral: డోక్లామ్‌పై కన్నేసిన డ్రాగన్.! భారత్, భూటాన్‌ల మధ్య చిరకాలంగా సన్నిహిత సంబంధాలు
చైనాతో సరిహద్దు వివాదాలున్న 14 దేశాల్లో భారత్, భూటాన్ మినహా మిగతావన్నీ బీజింగ్‌తో పరిష్కారం కుదుర్చుకున్నాయి. సుదీర్ఘకాలంగా భూటాన్‌తో డ్రాగన్ దేశం సాగిస్తున్న చర్చలు కీలక దశకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో భూటాన్ రాజు వాంగ్‌చుక్ ప్రధాని మోదీతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ రావడం ప్రాధాన్యం సంతరించుకొంది.భారత్, భూటాన్‌ల మధ్య చిరకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి.
చైనాతో సరిహద్దు వివాదాలున్న 14 దేశాల్లో భారత్, భూటాన్ మినహా మిగతావన్నీ బీజింగ్‌తో పరిష్కారం కుదుర్చుకున్నాయి. సుదీర్ఘకాలంగా భూటాన్‌తో డ్రాగన్ దేశం సాగిస్తున్న చర్చలు కీలక దశకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో భూటాన్ రాజు వాంగ్‌చుక్ ప్రధాని మోదీతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ రావడం ప్రాధాన్యం సంతరించుకొంది. భారత్, భూటాన్‌ల మధ్య చిరకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు దేశాలు 1949లోనే స్నేహ, సహకార ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ఆ ఒప్పందం ఉమ్మడి భద్రతకు భరోసా ఇస్తోంది. భారత సైన్యం భూటాన్‌లో స్థావరాలు ఏర్పరచుకుని, చైనా-భూటాన్ సరిహద్దులో పహరా కాస్తోంది. భారత సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ భూటాన్‌లో పలు మౌలిక వసతులను నిర్మించింది. భూటాన్ సైనికులకు భారత సైన్యం శిక్షణ ఇస్తోంది. భూటాన్‌పై దాడిని భారత్‌పై దాడిగా పరిగణిస్తామని 1958లో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు. చైనా అప్పటికే టిబెట్‌ను ఆక్రమించుకుంది. భూటాన్‌లో డోక్లాం సహా మొత్తం 764 చదరపు కిలోమీటర్ల భూభాగం తనదేనని డ్రాగన్ దబాయించింది. భూటాన్ విదేశాంగ విధానానికి 2007 వరకు భారతదేశమే సారథిగా వ్యవహరించింది. 2008లో భూటాన్‌లో రాజరికం స్థానంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి విదేశాంగ విధానంలో, ఆయుధ కొనుగోళ్లలో భూటాన్‌కు ఢిల్లీ ఎక్కువ స్వయం నిర్ణయాధికారం ఇవ్వసాగింది. భారత్, భూటాన్ దేశాలు తమ భూభాగాలను ఇతర దేశాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వబోమని సంయుక్తంగా ప్రకటించాయి. ఈ క్రమంలో 2017లో చైనా భూటాన్‌లోని డోక్లామ్‌లో అతిక్రమణలకు పాల్పడినప్పుడు భారత్ దాన్ని ప్రతిఘటించింది. దాంతో చైనా 2020లో భూటాన్‌లోని డోక్లాం సహా మరింత భూభాగం తనదేనని అడ్డం తిరిగింది.
భూటాన్‌లోని డోక్లాం సహా మొత్తం 269 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమకు అప్పగిస్తే, ప్రతిగా 495 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భూటాన్‌కు అప్పగిస్తామని 1996లోనే చైనా ప్రతిపాదించింది. కానీ భూటాన్ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. 1984 నుంచే చైనా, భూటాన్‌లు సరిహద్దులను గుర్తించడానికి చర్చలు జరుపుతున్నాయి. ఇటీవల బీజింగ్‌లో జరిగిన 25వ విడత చర్చల్లో రెండు దేశాల విదేశాంగ మంత్రులు సరిహద్దు గుర్తింపునకు నియమించే సాంకేతిక బృందం విధివిధానాలపై సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చర్చల ద్వారా భూటాన్ డోక్లామ్‌ను చైనాకు కానుకగా సమర్పిస్తుందని చెప్పలేం. పశ్చిమ ప్రాంతంలోని డోక్లాం పీఠభూమి- టిబెట్, భారత్, భూటాన్ కూడలిలో ఉంది. డోక్లాం చైనా చేతుల్లోకి వెళితే, అది భారత్ మీద సైనికంగా పైచేయి సాధించడానికి ఉపయోగపడుతుంది. భారతదేశాన్ని ఈశాన్య భారతంతో కలిపే సిలిగురి కారిడార్ పై డోక్లాం నుంచి దాడిచేసే సత్తా చైనాకు లభిస్తుంది. ఇప్పటికే టిబెట్ రాజధాని లాసా నుంచి సిక్కిం సరిహద్దులోని షిగాట్సె పట్టణం వరకు నిర్మించిన రైల్వే లైన్‌ను దక్షిణ టిబెట్‌లోని చుంబీ లోయ వరకు పొడిగించాలని డ్రాగన్ యోచిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో చైనా డోక్లామ్‌ను స్వాధీనం చేసుకుంటే చుంబీ నుంచి చికెన్స్ నెక్‌పై సులభంగా దాడి చేయగలుగుతుంది. అందుకే డోక్లామ్‌పై కుదిరే ఏ ఒప్పందమైనా చైనా, భూటాన్‌లకు మాత్రమే పరిమితం కాకూడదని, భారత్‌తో కూడిన త్రైపాక్షిక ఒప్పందంగానే అది ఉండాలని ఢిల్లీ డిమాండ్ చేస్తోంది. ఇదే విషయాన్ని భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ బెల్జియన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారతదేశం భూటాన్‌కు బయటి ప్రపంచానికి ముఖద్వారంగా ఉపయోగపడుతోంది. ఆ సౌలభ్యం చైనాతో ఉండదు. భూటాన్ ఆర్థికాభివృద్ధికి భారత్ మూల స్తంభంగా నిలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.