Karnataka: వేడుకున్నా సర్కార్ నుంచి నో రెస్పాన్స్.. చందాలు వేసుకుని బ్రిడ్జి నిర్మాణం.. వీడియో.
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా జమఖండి తాలూకా కంకన్‌వాడి గ్రామంలో దాదాపు 300 మంది జనాభా ఉంటారు. రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు మారాయి.. నాయకులు మారారు. అయినా వారి గ్రామం పక్కన ఉండే కృష్ణా నది దాటి తమ వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు అవసరమైన వంతెన కష్టం మాత్రం తీరలేదు. పాలకులు పట్టించుకోకపోవడంతో విసుగెత్తిన గ్రామస్థులు, రైతులు..
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా జమఖండి తాలూకా కంకన్‌వాడి గ్రామంలో దాదాపు 300 మంది జనాభా ఉంటారు. రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు మారాయి.. నాయకులు మారారు. అయినా వారి గ్రామం పక్కన ఉండే కృష్ణా నది దాటి తమ వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు అవసరమైన వంతెన కష్టం మాత్రం తీరలేదు. పాలకులు పట్టించుకోకపోవడంతో విసుగెత్తిన గ్రామస్థులు, రైతులు.. తమకు తాముగానే దాదాపు రూ.24 లక్షల వరకు చందాలు వేసుకొని కర్రల వంతెన నిర్మించుకున్నారు. మరో రెండు లక్షలు ఖర్చు పెట్టి ఆ వంతెనను ఓ మంత్రితోనే ఆవిష్కరింపజేసి.. ఇన్నేళ్లుగా పాలకులు వహించిన నిర్లక్ష్య వైఖరిని బయటి ప్రపంచానికి చాటారు. కంకన్‌వాడి గ్రామం పక్కనే కృష్ణా నది ప్రవహిస్తుంది. నదికి ఆవలి వైపున గుహేశ్వర్ ద్వీపంలో గ్రామస్థులకు మొత్తంగా 800 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. నది దాటితే గానీ వారు భూములకు వెళ్లలేని పరిస్థితి. అంత పెద్ద బ్రిడ్జి కట్టలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం గ్రామస్థులకు ఓ మెకనైజ్డ్ బోటును మాత్రం అందించింది. ప్రతి ఏడాదీ ఆ బోట్ నిర్వహణ కోసమే గ్రామస్థులు రూ.5-6 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. విసిగి వేసారిన గ్రామ ప్రజలు యూట్యూబ్ ద్వారా ఓ కర్రల వంతెన గురించి తెలుసుకొని, ఆ వీడియోను స్ఫూర్తిగా తీసుకొని లక్షల రూపాయల చందాలతో నది దాటేందుకు ఒక కర్రల వంతెన నిర్మించుకున్నారు. 30 మంది రైతులు మూడు నెలల్లో తాళ్లతో వంతెనను నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. 800 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేశారు. కొసమెరుపు ఏంటంటే జిల్లాకు చెందిన ఎక్సైజ్ మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్‌ను ఆహ్వానించి ధూంధాంగా వంతెనను ప్రారంభింపజేశారు. దీంతో మంత్రి గ్రామస్థులను అభినందించక తప్పలేదు. ఈ వార్తను చదివిన నెటిజన్లు మాత్రం పాలకులు, అధికారులు సిగ్గుపడేట్టు చేశారని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.