Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్‌ నిప్పుల వర్షం.. నెల రొజుల్లో ఎన్ని ప్రాణాలు పోయాయే తెలుసా..?

Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్‌ నిప్పుల వర్షం.. నెల రొజుల్లో ఎన్ని ప్రాణాలు పోయాయే తెలుసా..?

Anil kumar poka

|

Updated on: Nov 10, 2023 | 2:40 PM

ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర యద్ధం నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య పోరు రోజురోజుకీ తీవ్ర స్థాయికి చేరుతోంది. హమాస్‌ నెట్‌వర్క్‌ను మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజా పై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. గాజాపై ఇజ్రాయెల్‌ మరణహోమంలో 10,022 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రకటించింది.

ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర యద్ధం నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య పోరు రోజురోజుకీ తీవ్ర స్థాయికి చేరుతోంది. హమాస్‌ నెట్‌వర్క్‌ను మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజా పై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. గాజాపై ఇజ్రాయెల్‌ మరణహోమంలో 10,022 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. వీరిలో 4,104మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. అత్యధిక మంది ప్రజలు ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో మృతిచెందినట్లు తెలిపింది. మరోవైపు హమాస్‌ మిలిటెంట్ల దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెల్‌ దేశస్తులు మరణించారు. గాజా నగరాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్‌ దళాలు దానిని ఉత్తర, దక్షిణంగా రెండుగా విభజించినట్లు ప్రకటించాయి. యుద్ధంలో కీలక ఘట్టానికి చేరుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి ప్రకటించారు. గాజాలోని సాధారణ పాలస్తీనియన్లు తలదాంచుకుంటున్న శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి.సెంట్రల్‌ గాజాలో కనీసం మూడు శరణార్థి శిబిరాలపై జరిగిన బాంబు దాడుల్లో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. హమాస్‌తో సంబంధం లేని స్థానిక పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్‌ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 10, 2023 07:59 AM