Crime: భార్యపై కిరాతకం.! 17 సార్లు పొడిచి.. అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు.. వీడియో.
భార్య హత్య కేసులో అమెరికాలోని కేరళవాసికి అక్కడి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మూడేళ్ల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. అతను మారణాయుధంతో భార్యపై దాడి చేశాడు. ఈ కేసులో తొలుత గరిష్టంగా ఐదేళ్ల శిక్షను ఖరారు చేసింది కోర్టు. దోషి తన భార్యను 17 సార్లు అతి దారుణంగా పొడిచాడు. అనంతరం ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి.. తాజాగా దోషికి కఠిన యావజ్జీవ శిక్షను విధించారు.
భార్య హత్య కేసులో అమెరికాలోని కేరళవాసికి అక్కడి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మూడేళ్ల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. అతను మారణాయుధంతో భార్యపై దాడి చేశాడు. ఈ కేసులో తొలుత గరిష్టంగా ఐదేళ్ల శిక్షను ఖరారు చేసింది కోర్టు. దోషి తన భార్యను 17 సార్లు అతి దారుణంగా పొడిచాడు. అనంతరం ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి.. తాజాగా దోషికి కఠిన యావజ్జీవ శిక్షను విధించారు. కేరళకు చెందిన ఫిలిప్ మ్యాథ్యు ఇంకా మేరిన్ జోయ్ వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది జోయ్. అయితే.. మనస్పర్థల కారణంగా మ్యాథ్యు విడాకులు తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో.. విధులు ముగించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన జోయ్‌ని మ్యాథ్యు అడ్డగించి కత్తితో 17 సార్లు పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె పైనుంచి కారును పోనిచ్చాడు. జోయ్ సన్నిహితులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో తనకో పాప ఉంది అని తెలిపిన జోయ్.. నిందితుడు తన భర్తేనని వివరాలు తెలిపింది. దీని ఆధారంగా నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. దాదాపు మూడేళ్ల విచారణ తర్వాత న్యాయస్థానం దోషికి యావజ్జీవ శిక్ష విధించింది. తీర్పుపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు దోషికి శిక్ష పడిందని ఆనందం వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.