Viral Video: ఈ రెస్టారెంట్ వెరీ స్పెషల్.. నీటిలో రంగు రంగుల చేపలు.. ఫుడ్‌ని ఆస్వాదించే కస్టమర్స్

ఈ వీడియోలో రెస్టారెంట్ లోపల ఉన్న దృశ్యాన్ని చూపిస్తోంది. అక్కడ నేల చెరువులాగా చేయబడింది.. నీటితో నిండిన చెరువులో చేపలు ఈత కొడుతున్నాయి. అదే సమయంలో వీటన్నింటి మధ్య కుర్చీలు , బల్లలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడ కూర్చుని హాయిగా చేపలను చూస్తూ ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. చేపలను ఇష్టపడేవారు ఈ రెస్టారెంట్ కు వెళ్ళవచ్చు.

Viral Video: ఈ రెస్టారెంట్ వెరీ స్పెషల్.. నీటిలో రంగు రంగుల చేపలు.. ఫుడ్‌ని ఆస్వాదించే కస్టమర్స్
Sweet Fishs CafeImage Credit source: gunsnrosesgirl3
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2023 | 9:38 AM

రెగ్యులర్ గా తినే ఆహారపదార్ధాలను పక్కకు పెట్టి.. ఒక్కసారైనా సరే భిన్నమైన టేస్ట్ ఫుడ్ తినాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే కొందరు స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కు వెళ్తే.. మరికొందరు రెస్టారెంట్స్ కు లేదా హోటల్‌కు వెళ్లి ఆహారం తింటారు. సాధారణంగా ప్రజలు పరిశుభ్రత , ఆహారం మంచిగా ఉండే రెస్టారెంట్లకు వెళ్లడానికి ఇష్టపడతారు. అయితే మారుతున్న అభిరుచులకు అనుగుణంగా  కస్టమర్స్ ను కట్టుకోవడానికి  రెస్టారెంట్ యజమానులు ఇంటీరియర్ డెకరేషన్‌పై చాలా శ్రద్ధ చూపుతున్నారు. రెస్టారెంట్స్ అందంగా అలంకరించి ఉంటే … అక్కడికి వచ్చిన కస్టమర్స్ ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే మీరు ఎప్పుడైనా చేపల మధ్యలో ఉన్నట్లు అనిపించే రెస్టారెంట్‌ ని  చూశారా.. చేపలు ఈత కొడుతూ ఉంటే వాటి మధ్య కుర్చీలపై హాయిగా కూర్చుని ఆహారం తింటుంటే ఆహా అనిపిస్తుందా? ప్రస్తుతం అలాంటి ఒక రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూపరులను  ఆశ్చర్యపరుస్తుంది.

వాస్తవానికి  ఈ వీడియోలో రెస్టారెంట్ లోపల ఉన్న దృశ్యాన్ని చూపిస్తోంది. అక్కడ నేల చెరువులాగా చేయబడింది.. నీటితో నిండిన చెరువులో చేపలు ఈత కొడుతున్నాయి. అదే సమయంలో వీటన్నింటి మధ్య కుర్చీలు , బల్లలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడ కూర్చుని హాయిగా చేపలను చూస్తూ ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. చేపలను ఇష్టపడేవారు ఈ రెస్టారెంట్ కు వెళ్ళవచ్చు. థాయ్‌లాండ్‌లో ఉన్న ఈ రెస్టారెంట్ పేరు ‘స్వీట్ ఫిష్ కేఫ్’ అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఫిల్మీ లేదా జైలు నేపథ్య రెస్టారెంట్‌లను చూసి ఉండవచ్చు.. అయితే ఎక్కడైనా ఇలాంటి ప్రత్యేకమైన చేపల నేపథ్య రెస్టారెంట్‌ను చాలా అరుదుగా చూసి ఉంటారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది @gunsnrosesgirl3 అనే IDతో ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 18 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 13 మిలియన్లు లేదా 1.3 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకోగా 70 వేల మందికి పైగా లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘అంతస్తులు శుభ్రం చేసి అలసిపోయిన వారు దీన్ని కనిపెట్టారు’ అని ఎవరో చెబుతుంటే, ‘ఇక్కడ మీకు ఆహారం తింటూ ఉంటే ..  చేపల పాదాలకు మసాజ్ చేస్తాయి’ అని ఒకరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే