AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇదీ..పేద గిరిజనుడి ఇంటి కరెంట్ బిల్లుతో షాక్.. రెండు బల్బులకు లక్ష పైనే..!

సుందర రావుకు ప్రతినెల.. విద్యుత్ బిల్లు 300 రూపాయలు దాటదు. యూనిట్లు కూడా పదుల్లోనే ఉంటుంది. అది కూడా గిరిజనుడు కావడంతో సబ్సిడీ కూడా వస్తుంది. అయితే.. తాజాగా సుందర రావు చేతికి అందిన కరెంట్ బిల్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వందల నుంచి వేలు దాటిన కరెంట్ బిల్లు ఏకంగా లక్ష దాటేసింది ఆ బిల్లు. గిరిజన రైతు అయిన సుందర రావు.. తన ఇంట్లో బల్బులు తప్ప... మరి ఇతర విద్యుత్ ఉపకరణాలు లేవు. టీవీ లేదు.. ఫ్రిడ్జ్ లేదు.. ఫ్యాన్ కూడా వినియోగించడం లేదు.

ఇదేందయ్యా ఇదీ..పేద గిరిజనుడి ఇంటి కరెంట్ బిల్లుతో షాక్.. రెండు బల్బులకు లక్ష పైనే..!
High Electricity Bill
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 07, 2023 | 10:17 AM

విశాఖపట్నం జిల్లా, నవంబర్‌ 07; ఐదుగురు కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఓ గిరిజనుడి ఇంటి కరెంట్ బిల్లు వాళ్లకు షాకిచ్చింది.. రెండు గదుల ఆ ఇంటిలో రెండు విద్యుత్ బల్బులు మాత్రమే ఉన్నాయి. ఫ్యాన్, ఫ్రిజ్ వంటి ఏవీ లేవు.. కానీ అతనికి గత నెలలో వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే షాక్ కొట్టి కళ్లు బైర్లు కమ్మినంత పనైంది. వందల్లో రావలసిన కరెంటు బిల్లు.. వేలల్లో దాటి లక్షల్లో వచ్చింది. చాంతాడంత బిల్లును చూసి గుడ్లు తేలేసిన ఆ ఇంటిల్లిపాది షాక్‌కు గురయ్యారు అమాయక గిరిజన రైతులు. ఈ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. అల్లూరి ఏజెన్సీ పాడేరు మండలం వనుగుపిల్లి పంచాయతీ.. చింటగున్నలు గ్రామంలో నివాసం ఉంటున్నాడు పాంగి సుందర రావు . వృత్తి వ్యవసాయం. పేద గిరిజన రైతు అయిన సుందర రావు.. తన ఇంట్లో బల్బులు తప్ప… మరి ఇతర విద్యుత్ ఉపకరణాలు లేవు. టీవీ లేదు.. ఫ్రిడ్జ్ లేదు.. ఫ్యాన్ కూడా వినియోగించడం లేదు. మూడు రెండు బల్బులతోనే జీవనం సాగిస్తుంది ఆ కుటుంబం. అది కూడా రాత్రిపూట మాత్రమే ఆ బల్బులు వినియోగం.

– సుందర రావుకు ప్రతినెల.. విద్యుత్ బిల్లు 300 రూపాయలు దాటదు. యూనిట్లు కూడా పదుల్లోనే ఉంటుంది. అది కూడా గిరిజనుడు కావడంతో సబ్సిడీ కూడా వస్తుంది. అయితే.. తాజాగా సుందర రావు చేతికి అందిన కరెంట్ బిల్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వందల నుంచి వేలు దాటిన కరెంట్ బిల్లు ఏకంగా లక్ష దాటేసింది ఆ బిల్లు. ఒకటి కాదు రెండు కాదు పదివేలు కూడా కాదు.. ఏకంగా లక్షా 5వేల 352 రూపాయల..! ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన కరెంటు బిల్లు చూసిన సుందర రావుకు ఒక్కసారిగా షాక్ తగిలినంతపనైంది.. వ్యవసాయంపై ఆధారపడే తాను ఈ లక్షా 5వేల వేల బిల్లు ఎలా చెల్లించేది అంటూ తల పట్టుకున్నాడు ఆ గిరిజన రైతు.

– కరెంట్ బిల్లు ఒకసారిగా భారీగా రావడంతో ఆ రైతులో మరో అందోళన మొదలైంది. ఇప్పటికే భారీగా వచ్చిన విద్యుత్ బిల్లుతో గుండె పట్టుకున్న ఆ రైతు.. ఇప్పుడు ఆ బిల్లుతో ప్రభుత్వ పథకాలు కూడా తొలగిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నాడు. అయితే ఇటీవల సిపిఎం రక్షణ భేరి యాత్రలో.. ఈ విషయాన్ని తెలుసుకున్నారు నాయకులు. ఈ బిల్లు వ్యవహారంపై అధికారులు వెరిఫై చేస్తూ ఉన్నారు. అధికారులు కాస్త కనికరించి ఈ గిరిజన పేద రైతు కష్టాన్ని తీర్చాల్సిన అవసరం ఉంది .!

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..