AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మేకలు, గొర్రెలకు మేతగా కమ్మటి కొత్తిమీర.. సాగు చేసిన రైతుల కంట కన్నీరు.. ఆ కారణంతోనే దిగాలు

కొత్తిమిరను వ్యాపారులు బెడ్లు ప్రకారం కొనుగోలు చేస్తారని, బెడ్ ప్రస్తుతం రూ.100 పలుకుతుండగ ఒక కొత్తిమీరా కట్ట రూ.5 పలుకుతూ,వ్యాపారం రూ. 10వేలు దాటడంలేదని పెట్టుబడి కూడా రావడం లేదు. కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతు రాముడు తాను రెండు ఎకరాల్లో సాగుచేసిన కొత్తిమీర పంటను గొర్రెలకు మేతగా వేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి కొత్తిమీర రైతు ఆశలు అడియాశలయ్యాయి. సుమారు రెండు నెలల పాటు కొత్తిమీర పంటని కంటికి రెప్పలా కాపాడుకున్నా..

Andhra Pradesh:  మేకలు, గొర్రెలకు మేతగా కమ్మటి కొత్తిమీర.. సాగు చేసిన రైతుల కంట కన్నీరు.. ఆ కారణంతోనే దిగాలు
Coriander
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Nov 07, 2023 | 9:11 AM

Share

కర్నూలు, నవంబర్07;  కొత్తిమీర ఆకు లేనిదే ఏ వంటకు రుచి రాదు. అన్ని వంటల్లో తప్పనిసరిగా కొత్తిమీర ఉండాల్సిందే.. అందుకే కొత్తిమీరకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ, కొత్తిమీర పంటను సాగు చేసిన రైతులకు మాత్రం కొత్తిమీర కన్నీటిని మిగులుస్తుంది. మార్కెట్లో కొత్తిమీర కు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతన్నల్లు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో కొత్తిమీర సాగు చేసిన రైతు లబోదిబోమంటున్నారు. కొత్తిర పంటకు గిట్టుబాటు ధర లేక పండిన పంటను గొర్రెలను మేతగా వదిలాడు. రైతు రాముడు రెండు ఎకరాల్లో కొత్తిమీర పంటను సాగు చేసేందుకు గాను రూ 2లక్షల వరకు పెట్టుబడి పెట్టామని,ఈ పంట 40 రోజుల్లో కోతకు వస్తుందని తెలిపాడు.అదును తప్పితే, ఇక పంట ముదురుతే కొనేందుకు వ్యాపారులు రారని,దీంతో పంట లేతగా ఉన్న సమయంలోనే అమ్మకాలు జరగాలి, కాని గిట్టుబాటు ధర పలకడం లేదని రైతు ఆవేదనా వ్యక్తం చేస్తున్నాడు.

కొత్తిమిరను వ్యాపారులు బెడ్లు ప్రకారం కొనుగోలు చేస్తారని, బెడ్ ప్రస్తుతం రూ.100 పలుకుతుండగ ఒక కొత్తిమీరా కట్ట రూ.5 పలుకుతూ,వ్యాపారం రూ. 10వేలు దాటడంలేదని పెట్టుబడి కూడా రావడం లేదు. కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతు రాముడు తాను రెండు ఎకరాల్లో సాగుచేసిన కొత్తిమీర పంటను గొర్రెలకు మేతగా వేశాడు.

పంట చేతికి వచ్చే సమయానికి కొత్తిమీర రైతు ఆశలు అడియాశలయ్యాయి. సుమారు రెండు నెలల పాటు కొత్తిమీర పంటని కంటికి రెప్పలా కాపాడుకున్నా.. పంట చేతికి వచ్చేసరికి ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు దిగాలు పడిపోయారు. సాగు ఖర్చులో సగం కూడా వెనక్కు రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే