జుట్టు రాలడం, బట్టతలతో బాధపడుతున్నారా.. అయితే, ఇలాంటి ఇంటి చిట్కాలను ట్రై చేయండి

చాలా మందికి పెళ్లికి ముందే జుట్టు పూర్తిగా రాలిపోతుంది. దీని కారణంగా వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అలాంటి వారు నలుగురిలోకి వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అయితే, జుట్టు రాలటం అనేది కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన కారణాల వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో ఫాస్ట్ ఫుడ్ అలవాట్ల వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇలాంటి ఇంటి చిట్కాలను ట్రై చేయటం వల్ల తప్పక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

జుట్టు రాలడం, బట్టతలతో బాధపడుతున్నారా.. అయితే, ఇలాంటి ఇంటి చిట్కాలను ట్రై చేయండి
Baldness
Follow us

|

Updated on: Nov 07, 2023 | 7:46 AM

ఒకప్పుడు బట్టతలని వృద్ధాప్యానికి సంకేతంగా భావించేవారు. ఈ రోజుల్లో 20 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉన్నవారు కూడా జుట్టు బాధితులుగా మారుతున్నారు. దీనికి కారణం మన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తప్పుడు జీవనశైలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మందికి పెళ్లికి ముందే జుట్టు పూర్తిగా రాలిపోతుంది. దీని కారణంగా వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అలాంటి వారు నలుగురిలోకి వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అయితే, జుట్టు రాలటం అనేది కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన కారణాల వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో ఫాస్ట్ ఫుడ్ అలవాట్ల వల్ల ఎక్కువగా జుట్టు సమస్యలు ఎదురవటం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి హెయిర్ కేర్ టిప్స్ పాటించటం వల్ల మీరు జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

జుట్టు రాలడం అనేది కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యం, శారీరక, మానసిక ఒత్తిడి, ఇతర మెడిసిన్స్‌ వల్ల కలిగే సైడ్‌ఎఫెక్ట్‌ కూడా కావొచ్చు. లేదా పోషకాహారం లోపించడం వంటి కారణాల వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది. అయితే, కొన్ని రకాల హోం రెమిడీస్‌తో మీరు మీ జుట్టు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

1. ఉసిరి-వేప ఉసిరి, వేప సహాయంతో మీరు బట్టతల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇవి మీ రాలిపోయిన జుట్టును తిరిగి తీసుకురావడానికి సహాయపడతాయి. దీని కోసం, కొద్దిగా ఉసిరి పొడి, వేప ఆకులను నీటిలో బాగా మరిగించి, వారానికి రెండుసార్లు ఈ నీటితో మీ తలని కడగాలి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. క్రమంగా కొత్త జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

2. అతి మధురం

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు అతిమధురం కూడా అద్భుతంగా సహయపడుతుంది. జుట్టు సమస్యల నివారణకు మనం షాంపూ, కండీషనర్ వాడతాం. అలాగే అతిమధురాన్ని కూడా వాడితే మీ జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు తిరిగి పెరగడానికి, బట్టతలని తొలగించడానికి దోహదం చేస్తుంది.

3. ఉల్లిపాయతో జుట్టు సమస్యలకు చెక్..

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు చాలా మందిని వేధించే సమస్యలు. జుట్టు సమస్యలకు ఉల్లిపాయ చక్కటి ఉపశమనం ఇస్తుంది. ముందుగా ఉల్లిపాయను తీసుకుని దాన్ని మధ్య నుండి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి..కట్‌ చేసిన ఉల్లిపాయను తలపై జుట్టు ఎక్కువగా రాలుతున్న ప్రదేశంలో ప్రతిరోజూ ఐదు-ఏడు నిమిషాల పాటు సున్నితంగా రుద్దండి. ఇది జుట్టు రాలడాన్ని ఆపేస్తుంది.కొత్త జుట్టు కూడా పెరగడం ప్రారంభమవుతుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌