Andhra Pradesh: శ్రీశైలం దేవస్థానానికి తిరుప‌తి వాసి కారు విరాళం .. ఖరీదు ఎంతంటే..!

Srisailam Devastanam: శక్తిపీఠము జ్యోతిర్లింగము కొలువైన శ్రీశైల దేవస్థానానికి భక్తులు తాము కొరుకున్న కోర్కెల మేరకు విరాళాలు ఇస్తుంటారు. కొందరు హుండీ రూపంలో, మరికొందరు వజ్రాలు, బంగారు వెండి ఆభరణాల రూపంలో విరాళాలు ఇస్తుంటారు. శ్రీశైల మల్లన్న భక్తుడు ఒకరు భారీ విరాళం అందజేశారు. శ్రీశైల దేవస్ధానానికి తిరుప‌తి వాసి ఉద‌య్ కుమార్ రెడ్డి సోమ‌వారం ఎంజీ మోటార్స్ కారు ఆస్ట‌ర్‌ ను విరాళంగా అంద‌జేశారు.

Andhra Pradesh: శ్రీశైలం దేవస్థానానికి తిరుప‌తి వాసి కారు విరాళం .. ఖరీదు ఎంతంటే..!
Srisailam Devastanam
Follow us
J Y Nagi Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 07, 2023 | 8:22 AM

శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. భక్తులు తమ ఇష్టదైవనానికి తోచిన విరాళాలను అందజేస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రీశైల దేవస్ధానానికి తిరుప‌తికి చెందిన ఉద‌య్ కుమార్ రెడ్డి అనే భక్తుడు భారీ విరాళం అందజేశాడు. సోమ‌వారం శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఉదయ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబం దేవస్థానానికి ఎంజీ మోటార్స్ కారు ఆస్ట‌ర్‌ ను విరాళంగా అంద‌జేశారు. మార్కెట్లో ఈ కారు విలువ రూ.15 ల‌క్ష‌లు ఉంటుంది. శ్రీశైలం ఈవో పెద్దిరాజుకు ఉద‌య్ కుమార్ రెడ్డి ఈ కారును అంద‌జేశారు. సోమ‌వారం ఉద‌యం గంగాధ‌ర మండ‌పం వ‌ద్ద వేద పండితులు కారుకు ప్రత్యేక పూజ‌లు చేశారు.

కాగా, ఈ కారును దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ప్రధాన ఆలయం ఎదురుగల గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానానికి అందజేయగా, ఆలయ పూజారులు వారికి స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజుతోపాటు ఈఈ రామకృష్ణ, ఏఈవో మోహన్‌, స్వామివారి ఆలయ ప్రధానార్చకుడు శివప్రసాద్ పాల్గొన్నారు.

విరాళాలు ఇచ్చిన దాతలకు ఆలయ అధికారులు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు, అందించి సత్కరించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..