Viral Video: అభిరుచిని నెరవేర్చుకోవడానిక సదుపాయాలు కాదు కావాల్సింది సంకల్ప బలం.. స్టీల్ గిన్నెల డ్రమ్స్ వీడియో వైరల్

మహిళలకు రకరకాల అభిరుచులు ఉంటాయి. వంటలు చేయడం, కుట్లు, అల్లికలు వంటి మాత్రమే కాదు సంగీతం, నాట్యం, పెయింట్స్ వంటి ఇలా అనేక రకాల కళలు అభిరుచిగా ఉంటాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో హల చల్  చేసింది. ఇప్పుడు ఒక మహిళకు డ్రమ్స్ వాయించడం అభిరుచి. దీంతో తన ఇష్టాన్ని తీర్చుకోవడానికి తనకు అందుబాటులో ఉన్న వస్తువులతో డ్రమ్స్ తయారు చేసింది.

Viral Video: అభిరుచిని నెరవేర్చుకోవడానిక సదుపాయాలు కాదు కావాల్సింది సంకల్ప బలం.. స్టీల్ గిన్నెల డ్రమ్స్ వీడియో వైరల్
Jugad Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 13, 2023 | 9:35 AM

కృషి పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. ముఖ్యంగా అవసరాలు, అభిరుచుల విషయానికి వస్తే ప్రజలు ఏదో విధంగా తమ అవసరాలు తీర్చుకునే ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు రకరకాల అభిరుచులు ఉంటాయి. వంటలు చేయడం, కుట్లు, అల్లికలు వంటి మాత్రమే కాదు సంగీతం, నాట్యం, పెయింట్స్ వంటి ఇలా అనేక రకాల కళలు అభిరుచిగా ఉంటాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో హల్ చల్  చేసింది. ఇప్పుడు ఒక మహిళకు డ్రమ్స్ వాయించడం అభిరుచి. దీంతో తన ఇష్టాన్ని తీర్చుకోవడానికి తనకు అందుబాటులో ఉన్న వస్తువులతో డ్రమ్స్ తయారు చేసింది. స్క్రాప్ స్టీల్ పాత్రలతో డ్రమ్‌ని తయారు చేయడమే కాదు.. వాటి మీద అత్యంత అద్భుతంగా సాంగ్ ను ప్లే చేసింది. ఈ వీడియోలో మహిళ చాలా బాగా డ్రమ్స్ వాయించింది. అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది  TheFigen అనే ఖాతాలో ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది. ఇది నిజంగా అద్భుతమైనది స్క్రాప్ జుగాడ్‌తో తయారు చేసిన ఈ డ్రమ్ సెట్‌లో శిక్షణ పొందిన కళాకారిణిలా ఆ మహిళ ప్రదర్శన ఇచ్చిందని క్యాప్షన్‌ జోడించారు.

జుగాడ్‌తో చేసిన డ్రమ్ సెట్!

తన అభిరుచిని నెరవేర్చుకునేందుకు ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ మహిళ సిద్ధం చేసుకున్న డ్రమ్ సెట్ ఏ ఖరీదైన దుకాణం నుంచి కొనుగోలు చేయలేదు. వృత్తిపరమైన పరికరం కాదని వైరల్ క్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. పాత స్టీల్ వస్తువులు, ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను ఉపయోగించి ఈ  డ్రమ్ సెట్‌ను తయారు చేశారు. అయితే మేకింగ్ స్టైల్, ప్లే చేస్తున్న మహిళ ప్రతిభ ప్రొఫెషనల్ కంటే తక్కువ కాదు.

అక్టోబర్ 7న పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. X వినియోగదారులు చాలామంది మహిళ ప్రతిభను మెచ్చుకున్నారు. ఒకరు వ్యాఖ్యానిస్తూ అద్భుతం అంటే మరొకరు ఎంత ప్రతిభని వ్యాఖ్యానించారు.  రా మీ స్పందనలను మాకు తెలియజేయండి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..