Ram Charan Diwali: రామ్ చరణ్ ఇంట్లో దీపావళి విందు. ఫ్యామిలీతో హాజరైన తారక్ , వెంకీ మామ , మహేష్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల నివాసంలో టాలీవుడ్ హీరోలు సందడి చేశారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. రామ్ చరణ్ కూతురు క్లింకారాకు తొలి దీపావళి పండుగ కావడంతో మెగా హీరో గ్రాండ్ పార్టీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. శనివారం రాత్రి హైదరాబాద్ లోని తమ నివాసంలో రామ్ చరణ్ దంపతులు ఏర్పాటు చేసిన ఈ విందుకు విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు- నమ్రత, ఎన్టీఆర్-ప్రణతి హాజరయ్యారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల నివాసంలో టాలీవుడ్ హీరోలు సందడి చేశారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. రామ్ చరణ్ కూతురు క్లింకారాకు తొలి దీపావళి పండుగ కావడంతో మెగా హీరో గ్రాండ్ పార్టీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. శనివారం రాత్రి హైదరాబాద్ లోని తమ నివాసంలో రామ్ చరణ్ దంపతులు ఏర్పాటు చేసిన ఈ విందుకు విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు- నమ్రత, ఎన్టీఆర్-ప్రణతి హాజరయ్యారు. టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా రామ్ చరణ్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను మహేశ్ బాబు సతీమణి నమ్రత తన ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. కియారా ఆడ్వాణీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.