Watch Video: టేకాప్ కు కొన్ని సెకన్ల ముందు విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. వీడియో వైరల్‌

విమానంలోనే ప్రసవించిన మహిళకు కావాల్సిన చికిత్స అందించారు. విమానం టెకాప్‌కు కొద్ది క్షణల ముందు మహిళకు పురిటి నొప్పులు రావటం అంతలోనే ఆమె పసిపాపకు జన్మనివ్వటం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. సిబ్బంది హడావుడిగా వెళ్లటం, రావటం వంటి దృశ్యాలను విమానంలోని ప్రయాణికులు కొందరు తమ సెల్‌ఫోన్లతో వీడియోలు చిత్రీకరించారు. మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన వీడియో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను తెలయజేస్తున్నారు. 

Watch Video: టేకాప్ కు కొన్ని సెకన్ల ముందు విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. వీడియో వైరల్‌
New Born Baby Girl
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 21, 2023 | 3:37 PM

టేకాప్ కు కొన్ని సెకన్ల ముందు విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. కానీ, ప్రిమెచ్యుర్ గా పుట్టిన పాపను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి కావాల్సిన చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి ఊహించని సంఘటన టర్కీ నుంచి ఫ్రాన్స్ వెళ్తున్న అంతర్జాతీయ విమానంలో చోటు చేసుకుంది. టేకాఫ్‌ కు కొన్ని సెకన్ల ముందు ఓ మహిళకు నెలలు నిండకుండానే పురిటినొప్పులు వచ్చాయి. తీవ్ర ప్రసవ వేధనతో ఆ మహిల విమానంలోనే పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా సంఘటన సమయంలో పెగాసస్ ఎయిర్‌లైన్స్ విమానం ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌కి టేకాఫ్ కోసం సిద్ధంగా ఉందని తెలిసింది. అయితే, అప్పుడే పుట్టిన నవజాత శిశువును కొందరు విమానం నుండి బయటకు తీసుకు వెళ్లటం కనిపించింది. మిగతా ప్రయాణికులంతా జరిగిన ఘటనతో ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.

వైరల్‌ వీడియోలో, వైద్య సిబ్బంది మహిళ వద్దకు పరుగెత్తటం కనిపించింది. మహిళకు పురిటినొప్పులు మొదలయ్యాయని తెలిసిన వెంటనే విమాన సిబ్బంది, వైద్యులు స్పందించారు. విమానంలోనే ప్రసవించిన మహిళకు కావాల్సిన చికిత్స అందించారు. విమానం టెకాప్‌కు కొద్ది క్షణల ముందు మహిళకు పురిటి నొప్పులు రావటం అంతలోనే ఆమె పసిపాపకు జన్మనివ్వటం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. సిబ్బంది హడావుడిగా వెళ్లటం, రావటం వంటి దృశ్యాలను విమానంలోని ప్రయాణికులు కొందరు తమ సెల్‌ఫోన్లతో వీడియోలు చిత్రీకరించారు. మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన వీడియో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను తెలయజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చివర్లో, వైద్య సిబ్బంది డ్రస్‌లో కనిపిస్తున్న ఒక మహిళ నవజాత శిశువును నీలిరంగు టవల్‌లో చుట్టి తీసుకువెళుతుండగా, ప్రయాణీకులు చప్పట్లు కొట్టి విమాన సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి ప్రశంసలు తెలియజేశారు. అయితే, సదరు మహిళకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. ఇకపోతే, విమానంలో, విమాన ప్రయాణంలో శిశువు జన్మించడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా పలుమార్లు జరిగిన వార్తలు విన్నాం. గతంలో విమానంలో ఓ మహిళ ప్రయాణికురాలు.. తాను గర్భవతి అని తెలియకుండానే.. కడుపునొప్పితో బాత్‌రూమ్‌కి వెళ్లి ప్రసవించిన ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!