కెనరా బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం.. అద్దాలు పగలగొట్టి పరుగులు తీసిన ఉద్యోగులు, సిబ్బంది..

నావెల్టీ సినిమా థియేటర్‌ వెనుక భాగంలో జరిగిన ఈ ప్రమాదంపై తీవ్ర దుమారం రేగింది. ఈ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొదటి అంతస్తులో దాదాపు 50 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇప్పుడు మంటలను అదుపు చేసి ప్రజలందరినీ సురక్షితంగా బయటకు తీశారు.

కెనరా బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం.. అద్దాలు పగలగొట్టి పరుగులు తీసిన ఉద్యోగులు, సిబ్బంది..
Lucknow Bank Fire
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 20, 2023 | 10:10 PM

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని కెనరా బ్యాంక్ భవనంలో మంటలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం భవనం మొదటి అంతస్తులో మంటలంటుకున్నాయి.. ఆకస్మికంగా జరిగిన ప్రమాదంతో గందరగోళం నెలకొంది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు అద్దాలు పగులగొట్టి మెట్లపై నుంచి బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వాహనాలు హుటాహుటినా సహాయక చర్యలు ప్రారంభించాయి.

సోమవారం సాయంత్రం హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని నావల్ కిషోర్ రోడ్డులోని కెనరా బ్యాంక్ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. నావెల్టీ సినిమా థియేటర్‌ వెనుక భాగంలో జరిగిన ఈ ప్రమాదంపై తీవ్ర దుమారం రేగింది. ఈ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొదటి అంతస్తులో దాదాపు 50 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇప్పుడు మంటలను అదుపు చేసి ప్రజలందరినీ సురక్షితంగా బయటకు తీశారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని భవనంలో ఉన్న ఉద్యోగులందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన తర్వాత, బ్యాంక్ ఉద్యోగులు ఆఫీసు కిటికీల నుండి దూకేందుకు ప్రయత్నించడం, తప్పించుకోవడానికి భవనం పైకి పరుగులు తీయటం కనిపించింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పివేసి అందరినీ రక్షించినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు.

మొదటి అంతస్తులో మంటలు చెలరేగడానికి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూటే కారణమని ఫైర్‌ సెఫ్టీ అధికారులు చెబుతున్నారు. భవనం నుంచి కిటికీలోంచి తప్పించుకున్న ఓ బ్యాంకు ఉద్యోగి ఎయిర్ కండీషనర్ మంటల్లో కాలిపోవటంతో దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల దాదాపు 50 మంది ఉన్నారు. కిటికీలు పగలగొట్టి బయటకు దూకేందుకు ప్రయత్నించటంతో పలువురు గాయపడినట్టుగా చెప్పారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?