Viral Video: జంగిల్ సఫారీలో షాకింగ్ సీన్.. టూరిస్ట్ కారు ఎక్కిన సింహం.. పెంపుడు కుక్కలా ప్రేమ..

కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా జంగిల్ సఫారీ ఒక ఫ్యాషన్‌గా మారింది. ప్రజలు అడవికి వెళ్లి సింహం, పులి వంటి ప్రమాదకరమైన జంతువులను  దగ్గరగా చూసి ఆనందిస్తున్నారు. ఇలా పర్యటించే సమయంలో కొన్ని సార్లు ఈ కౄర జంతువులు పర్యాటకులతో నిండిన వాహనాలపైకి ఎక్కుతాయి. దూరంగా ఉన్నప్పుడు చూసి ఆనందించే పర్యాటకులు హఠాత్తుగా తమ మీదకు సింహం లేదా పులి వంటివి వస్తే.. అప్పుడు కలిగే భయం వర్ణనాతీతం.

Viral Video: జంగిల్ సఫారీలో షాకింగ్ సీన్.. టూరిస్ట్ కారు ఎక్కిన సింహం.. పెంపుడు కుక్కలా ప్రేమ..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 23, 2023 | 1:12 PM

అడవిలో నివసించే సింహం, పులి, ఎలుగుబంటి, చిరుత పులి వంటి  కౄర జంతువులు అంటే అందరికీ భయమే.. ఎవరికైనా అకస్మాత్తుగా సింహం, పులి వంటి జంతువులు కనిపిస్తే అప్పుడు వారి పరిస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందుకనే ప్రమాదకరమైన వన్యప్రాణులను జంతుప్రదర్శనశాలల్లో ఎన్‌క్లోజర్‌లలో లేదా బోనులలో ఉంచుతారు. బోనుల్లో ఉన్న ఈ కౄర మృగాలు ఎవరికీ హాని కలిగించవు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా జంగిల్ సఫారీ ఒక ఫ్యాషన్‌గా మారింది. ప్రజలు అడవికి వెళ్లి సింహం, పులి వంటి ప్రమాదకరమైన జంతువులను  దగ్గరగా చూసి ఆనందిస్తున్నారు. ఇలా పర్యటించే సమయంలో కొన్ని సార్లు ఈ కౄర జంతువులు పర్యాటకులతో నిండిన వాహనాలపైకి ఎక్కుతాయి. దూరంగా ఉన్నప్పుడు చూసి ఆనందించే పర్యాటకులు హఠాత్తుగా తమ మీదకు సింహం లేదా పులి వంటివి వస్తే.. అప్పుడు కలిగే భయం వర్ణనాతీతం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే ఎవరికైనా గూస్‌బంప్స్ వస్తాయి.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో సింహం పర్యాటకులతో నిండిన కారులోకి ఎక్కి వారిపై ప్రేమను కురిపించింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన దృశ్యం.. ఎందుకంటే సాధారణంగా సింహం మనుషులను చూస్తే ఆనందించవు.. సరికదా మనుషులపై దాడి చేస్తాయి. జంగిల్ లో టూరిస్టుల కారును తమ దగ్గరకు వచ్చిన సింహం చూసి నిలిపివేశారు. అప్పుడు సింహం ఆ వాహనంలోకి ఎక్కి అందులో ఉన్న మహిళల వద్దకు వెళ్లి వారిపై ప్రేమను కురిపిస్తూ కౌగిలించుకుంది. ఈ వీడియో చూస్తే ఎవరికైనా చూస్తుంది సింహమా లేక పెంపుడు కుక్కా అనిపిస్తుంది ఎవరికైనా.. ఎందుకంటే పెంపుడు కుక్క తన యజమాని పట్ల ఎంతగా ప్రేమని కురిపిస్తుందో అదే విధంగా సింహం కూడా ఆ వాహనంలో ఉన్న పర్యాటకులపై ప్రేమని కురిపిస్తోంది. సింహానికి దూరంగా ఉండాలి. ఇది నిజం కూడా.. అయితే ఈ వీడియో చూస్తే ఎవరి మనసు అయినా ఆనందంతో నిండిపోతుంది.

ఇవి కూడా చదవండి

 సింహానికి ప్రేమ కావాలి..

ఈ వీడియో @AMAZlNGNATURE అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 41 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 9 మిలియన్లకు పైగా వీక్షించగా, లక్ష మందికి పైగా వీడియో లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లను ఇస్తున్నారు. ఒకరు ఈ రకమైన సంఘటనలు నిజానికి చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే అది సింహం.. తన కౄర స్వభావాన్నీ వదిలిపెట్టినట్లు ప్రజలను నమ్మేలా చేస్తాయి’ కనుక జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ హెచ్చరిస్తూ కామెంట్ చేశారు. ‘నేను జంతువులను ప్రేమిస్తాను..  కానీ నేను అక్కడ ఉన్నవారిలో ఒకరిని అయితే సింహం అలా మీదకు వస్తే ఖచ్చితంగా భయంతో వణికిపోతానని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..