It never ends: బుక్‌లో ఉన్నవి 628 పేజీలే.. 28 ఏళ్లుగా చదువుతున్నా ఇంకా పూర్తికాని పుస్తకం..స్పెషాలిటీ ఏమిటంటే

నివేదికల ప్రకారం బుక్ క్లబ్ సభ్యులు తమ జీవితంలోని గత 28 సంవత్సరాలుగా 'ఫిన్నెగాన్స్ వేక్'ని పేజీల వారీగా అర్థం చేసుకోవడానికి.. దానిలోని అనేక రహస్యాలను విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివానని, బాగా అర్థం చేసుకున్నానని ఎవరూ చెప్పలేనంత క్లిష్టంగా ఈ పుస్తకం ఉందని అంటారు. ఈ పుస్తకం దాదాపు 80 భాషలను సూచించే పదాలు, వాక్యాలు, సంకేతాల సంక్లిష్ట మిశ్రమంలో వ్రాయబడింది.

It never ends: బుక్‌లో ఉన్నవి 628 పేజీలే.. 28 ఏళ్లుగా చదువుతున్నా ఇంకా పూర్తికాని పుస్తకం..స్పెషాలిటీ ఏమిటంటే
Finnegans Wake
Follow us
Surya Kala

|

Updated on: Nov 23, 2023 | 3:18 PM

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సెల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి వస్తువుల వినియోగం ఎక్కువైంది. చాలామందికి పుస్తకాలు చదవడం అనే అభిరుచి తగ్గిపోయింది అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ చాలా మందికి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించడం, టీవీ చూడటం కంటే పుస్తకాలు చదవడమే ఇష్టం. పుస్తకాన్ని చదవడం అంటే ఇష్టం ఉన్నవారు.. చదవడం మొదలు పెడితే.. ఆ పుస్తకాన్ని పూర్తి చేసే వరకూ కూర్చున్న చోట నుంచి కదలని వారు కూడా ఉన్నారు. అలా ఒక్క రోజులోనే పుస్తకాన్ని  పూర్తి చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నది ఏళ్ళ తరబడి చదువుతున్న పుస్తకం గురించి. ఆ పుస్తకం చదవడం ఇంకా పూర్తి కాలేదు. అయితే ఆ పుస్తకంలో లెక్కలేనన్ని పేజీలు ఉన్నాయని కాదు.. ఆ పుస్తకంలో దాదాపు 600 పేజీలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ ప్రజలు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవలేదు.

ఈ పుస్తకం పేరు ఫిన్నెగాన్స్ వేక్. దీనిని జేమ్స్ జాయిస్ అనే ఐరిష్ రచయిత రాశారు. ఈ పుస్తకం నిజానికి ఒక నవల. ఇందులో మొత్తం 628 పేజీలు ఉన్నాయి. వెబ్‌సైట్ ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం  కాలిఫోర్నియాకు చెందిన ఒక బుక్ క్లబ్ 28 సంవత్సరాల క్రితం చదవడం ప్రారంభించి ఇటీవల ఈ పుస్తక మొదటి పఠనాన్ని పూర్తి చేసింది. ఇది చాలా కష్టమైన పుస్తకం. నిజానికి జేమ్స్ జాయిస్ ఒకసారి తన పాఠకులను కోరింది ఏమిటంటే.. తన పాఠకులు వారి జీవితాన్ని తన రచనలను చదవడానికి అంకితం చేయాలి’ అని కోరారు. కొంతమంది దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

పుస్తకం 80 భాషల్లో వ్రాయబడింది

నివేదికల ప్రకారం బుక్ క్లబ్ సభ్యులు తమ జీవితంలోని గత 28 సంవత్సరాలుగా ‘ఫిన్నెగాన్స్ వేక్’ని పేజీల వారీగా అర్థం చేసుకోవడానికి.. దానిలోని అనేక రహస్యాలను విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివానని, బాగా అర్థం చేసుకున్నానని ఎవరూ చెప్పలేనంత క్లిష్టంగా ఈ పుస్తకం ఉందని అంటారు. ఈ పుస్తకం దాదాపు 80 భాషలను సూచించే పదాలు, వాక్యాలు, సంకేతాల సంక్లిష్ట మిశ్రమంలో వ్రాయబడింది.

ఇవి కూడా చదవండి

ఇది అంతం లేని పుస్తకం

కాలిఫోర్నియాకు చెందిన ప్రయోగాత్మక చిత్రనిర్మాత గెర్రీ ఫియాల్కా 1995లో ఈ పుస్తకాన్ని చదవడానికి వ్యక్తుల సమూహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతినెలా 10 నుంచి 30 మంది స్థానిక లైబ్రరీలో కూర్చొని కేవలం రెండు పేజీల పుస్తకాన్ని చదివి దానిపై అభిప్రాయాలు చెప్పేవారు. అయితే ఆ తర్వాత అతను సమావేశానికి ఒక పేజీకి తగ్గించాడు. గెర్రీ ఫియాల్కా రీడింగ్ గ్రూప్ సభ్యుడు పీటర్ క్వాడ్రినో పుస్తకం చదువుతున్నప్పుడు,  పుస్తకంలో వ్రాసిన ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడానికి 30 రకాల వికీపీడియా ట్యాబ్‌లను తెరిచి ఉంచేవాడని చెప్పాడు. ‘ఫిన్నెగాన్స్ వేక్’ ఎప్పటికీ ముగియని పుస్తకం అని ఈ రీడింగ్ గ్రూప్ చెబుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..