China: చైనా వైరస్ ఫ్యాక్టరీని నడుపుతుందా? 25 ఏళ్లలో ఎన్ని ప్రాణాంతక వ్యాధులు వచ్చాయో తెలుసా..

ప్రపంచాన్ని కష్టాల్లోకి నెట్టిన కరోనా వైరస్ చైనాలో పుట్టింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు. గత 25 సంవత్సరాల్లో చైనాలో కరోనా మాత్రమే కాదు.. అటువంటి అనేక వైరస్ లు అంటువ్యాధులుగా మారాయి. అందుకే చైనాలో విస్తరిస్తున్న ఈ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వ్యాధి కొత్త వైరస్ లేదా కరోనా వైరస్ కి చెందిన సరికొత్త రూపమా అనేది ఇంకా నిర్ధారించబడలేదు.

China: చైనా వైరస్ ఫ్యాక్టరీని నడుపుతుందా? 25 ఏళ్లలో ఎన్ని ప్రాణాంతక వ్యాధులు వచ్చాయో తెలుసా..
China Run A Virus Factory
Follow us
Surya Kala

|

Updated on: Nov 24, 2023 | 8:34 AM

చైనాలో పుట్టిన కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం ఇంకా తేరుకోక ముందే.. మళ్ళీ  చైనాలో  కొత్త వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి అంతుచిక్కని లక్షణాలున్న న్యుమోనియా. ఈ వ్యాధి బారిన పిల్లలు పడుతున్నారని.. ఈశాన్య బీజింగ్, లియానింగ్‌లోని ఆసుపత్రుల్లో న్యుమోనియాతో బాధపడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. చైనాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది WHO కూడా హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు చైనా నుండి ఈ వ్యాధి గురించి పూర్తి సమాచారం కోరింది. ఈ కొత్త వైరస్ కూడా ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారుతుందేమో అని WHO భయపడుతోంది.

ప్రపంచాన్ని కష్టాల్లోకి నెట్టిన కరోనా వైరస్ చైనాలో పుట్టింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు. గత 25 సంవత్సరాల్లో చైనాలో కరోనా మాత్రమే కాదు.. అటువంటి అనేక వైరస్ లు అంటువ్యాధులుగా మారాయి. అందుకే చైనాలో విస్తరిస్తున్న ఈ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వ్యాధి కొత్త వైరస్ లేదా కరోనా వైరస్ కి చెందిన సరికొత్త రూపమా అనేది ఇంకా నిర్ధారించబడలేదు.

చైనా వైరస్ ఫ్యాక్టరీని నడుపుతుందా?

కరోనా వైరస్ మూలం చైనాలో అని విశ్వాసం. ఈ వైరస్ తో ప్రపంచ వ్యాప్తంగా చైనా పరువు పోయింది. కరోనా గురించి చైనా సరైన సమాచారం ఇవ్వ లేదని WHO ఆరోపించింది. అనంతరం చేసిన పరిశోధనలో కరోనా పుట్టింది చైనాలోని వుహాన్‌లో అని తేలింది. ప్రపంచ సంస్థలను విశ్వసిస్తే, చాలా సంస్థలు అంటువ్యాధులకు చైనా కారణమని భావిస్తాయి. WHO వ్యాధి వ్యాప్తి కూడా దీనిని నిర్ధారిస్తుంది. దీని ప్రకారం చైనాలో ఇప్పటివరకు ఎంట్రోవైరస్, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, జూనోటిక్ ఊపిరితిత్తుల వ్యాధి వంటి అనేక వ్యాధులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

జంతువుల నుండి సంక్రమించే వైరస్

గతేడాది చైనాలో జూనోటిక్‌ వైరస్‌ కనిపించిన కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తోంది. ఇది ప్రాణాంతక వైరస్. దీని లక్షణాలు ఫ్లూ మాదిరిగానే ఉంటాయి. ఈ వైరస్ సోకిన బాధితులు ఆయాసం, దగ్గు,  వికారం వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. ఈ వైరస్ ప్రత్యేకత ఏమిటంటే ఈ వ్యాధికి చైనాలో ఇంకా చికిత్స లేదా వ్యాక్సిన్ లేదు. దీనిని హెనిపావైరస్ లేదా లాంగ్యా వైరస్ అంటారు.

రహస్యమైన న్యుమోనియా

2019లో కూడా చైనాలో న్యుమోనియా వచ్చింది. ఈ న్యుమోనియా కూడా వుహాన్ లోనే మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. జనవరి 3 నాటికి ఈ న్యుమోనియాతో బాధపడుతున్న 44 మంది రోగుల గురించి చైనా అధికారులు WHOకి తెలియజేశారు. 11 మంది ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ మర్మమైన న్యుమోనియా లక్షణాలు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌.

ఎంట్రోవైరస్

1998లో చైనాలో ఎంట్రోవైరస్ వ్యాప్తి చెందింది. WHO వ్యాప్తి నివేదిక ప్రకారం ఈ వైరస్ ప్రజల వెన్నుపాముపై దాడి చేస్తుంది. ఆ సమయంలో వేలాది మంది దీని బారిన పడ్డారు. చాలా మంది మరణించినట్లు కూడా నిర్ధారించబడింది. ఈ వైరస్ మొట్టమొదట కనిపించినప్పటి నుంచి చైనాలో ఈ వైరస్ కు సంబంధించిన  ఔషధం లేదా వ్యాక్సిన్ లేదు. ఈ వైరస్ కరోనా అంత ప్రమాదకరం కానప్పటికీ.. ఇది ఇప్పటికీ దేశంలో అంటువ్యాధి రూపంలో ఉంది.

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్

2016లో చైనాలో రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ కూడా నమోదైంది. ఇది ఆఫ్రికన్ వైరస్.. అయితే చైనాలో మరింత ఘోర మైన రూపంలో వ్యాపించింది. ముఖ్యంగా హెనాన్ ప్రావిన్స్‌లో చాలా మంది దీని బాధితులుగా మారారు. దీని లక్షణాలు తలనొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి.

ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా

ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా ఈ వైరస్ మొదటి కేసు బెల్జియంలో నమోదైంది. అయితే ఈ వైరస్ మూలాలు చైనాలో వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ వైరస్ కారణంగా మొదటి మరణం చైనాలోనే సంభవించింది. ఇది మొదటిసారిగా మార్చి 2013లో చైనాలోని మనిషికి సోకినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ కారణంగా దాదాపు 615 మంది మరణించారు. దీని తరువాత చాలా సంవత్సరాలుగా ఈ వైరస్ చైనాలో వెలుగులోకి వస్తూనే ఉంది. గతేడాదిలో కూడా ఇదే జోరులో వైరస్ వ్యాపించింది. 2022లో జనవరి 27న గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక తర్వాత చైనాలో దీనిని వ్యాప్తి నివారించడానికి ప్రయత్నాలు జరిగాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం