China Air Pollution: ఐదేళ్ల క్రితం కాలుష్య కోరల్లో చైనా.. ఈ యుద్ధంలో చైనా ఎలా గెలిచిందో తెలుసా..!

ఐదేళ్ల క్రితం చైనాలో వాయు కాలుష్యం పెద్ద సమస్య. పొగమంచు కమ్ముకోవడంతో ఆకాశం కూడా కనిపించలేదు. పాఠశాలలు, కళాశాలలు మూసి వేసి అందరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు. చాలా రోజులుగా ఎండలు కనిపించని పరిస్థితి నెలకొంది. తమ దేశంలో వేగంగా క్షీణిస్తున్న వాయు కాలుష్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చైనా 2013లో నేషనల్ ఎయిర్ క్వాలిటీ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసింది. ఇందుకోసం రూ.19 వేల కోట్ల విలువైన పథకాలను రెడీ చేసి ప్రభుత్వం ఆమోదించి వెంటనే అమలు చేసింది. ఈ పథకాల వలన కొందరికి ఇబ్బందులు పెంచినప్పటికీ..  ప్రభుత్వం మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంది.

China Air Pollution: ఐదేళ్ల క్రితం కాలుష్య కోరల్లో చైనా.. ఈ యుద్ధంలో చైనా ఎలా గెలిచిందో తెలుసా..!
China War Against Pollution
Follow us

|

Updated on: Nov 14, 2023 | 9:16 AM

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి వేళ పెద్ద ఎత్తున టపాసులు పేల్చడంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఇటీవలి వర్షం కారణంగా కాలుష్య సమస్య కాస్త సద్దుమణిగినా దీపావళితో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఢిల్లీ కాలుష్య కోరల నుంచి కాస్త బయటపడిందని ఊపిరిపీల్చుకునేలోపే దీపావళి తర్వాత పరిస్థితులు మళ్లీ ప్రమాదకరంగా మారాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ తదితర ప్రాంతాల్లో భారీగా బాణసంచా కాల్చడంతో రాజధాని పరిసర ప్రాంతాలను కాలుష్య పొగ కమ్మేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ మొత్తం 400కి చేరుకుంది. వాస్తవానికి ఇప్పుడు చలి కూడా పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో ఆకాశంలో పొగ మంచు, విషపూరిత గాలులు వేగంగా పెరుగుతోంది. అయితే ఇలాంటి పరిస్థితినే గతంలో చైనా ఎదుర్కొంది. అయితే ఇప్పుడు చైనా పొగమంచును పూర్తిగా నియంత్రించింది. ఈ నేపథ్యంలో చైనా నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి.

ఐదేళ్ల క్రితం చైనాలో వాయు కాలుష్యం పెద్ద సమస్య. వాయుకాలుష్యం కారణంగా ఏటా 5 లక్షల మంది చనిపోతున్నంత దారుణంగా పరిస్థితి తయారైంది. పొగమంచు కారణంగా ఆకాశం కూడా కనిపించలేదు. పాఠశాలలు, కళాశాలలు మూసి వేసి అందరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు. చాలా రోజులుగా ఎండ వేడి కూడా నేల మీద పడని పరిస్థితి నెలకొంది. అప్పటి చైనా పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. గత ఐదేళ్లలో చైనాలో PM2.5 (పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5) మూడింట ఒక వంతు తగ్గింది.

అతిసూక్ష్మ ధూళికణాలు

గాలిలో ఉండే ప్రమాదకరమైన సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులను పాడుచేస్తాయి. సూక్ష్మ కణాలు. 2.5 దాటితే గాలి విషపూరితం అవుతుంది. అతిసూక్ష్మ ధూళికణాలు మానవ జుట్టు వెడల్పు కంటే 30 రెట్లు చిన్నవి. అవి గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులపై పొరను ఏర్పరుస్తాయి, దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చైనాలో నేషనల్ ఎయిర్ క్వాలిటీ యాక్షన్ ప్లాన్ అమలు

తమ దేశంలో వేగంగా క్షీణిస్తున్న వాయు కాలుష్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చైనా 2013లో నేషనల్ ఎయిర్ క్వాలిటీ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసింది. ఇందుకోసం రూ.19 వేల కోట్ల విలువైన పథకాలను రెడీ చేసి ప్రభుత్వం ఆమోదించి వెంటనే అమలు చేసింది. ఈ పథకాల వలన కొందరికి ఇబ్బందులు పెంచినప్పటికీ..  ప్రభుత్వం మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంది.

చైనా ఎలాంటి చర్యలు తీసుకుందంటే..

ముందుగా పాతవి, పనికిరాని వాహనాలు అనుమతిని పూర్తిగా రద్దు చేశారు. బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌల్లో కార్ల వాహనాల వాడకం సంఖ్యను తగ్గించారు. వాయుకాలుష్య కర్మాగారాలన్నీ నగరం వెలుపల ఇతర ప్రాంతాలకు తరలించారు. చాలా ఫ్యాక్టరీలు పూర్తిగా మూసివేశారు. నగరాల్లో స్వచ్ఛమైన గాలి కోసం అనేక రకాల కారిడార్లను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో చెట్లు నాటాయి. ఫ్యాక్టరీల్లో బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశారు. కొత్త ప్లాంట్‌కు అనుమతి ఇవ్వడం నిలిపివేశారు. ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు.

పొయ్యిల వినియోగంపై నిషేధం

2013లో బీజింగ్‌లోని 4 మిలియన్లకు పైగా గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఇంధనంగా బొగ్గును ఉపయోగించేవారు. చలి నుంచి రక్షణ కోసం బొగ్గు వినియోగం అధికంగా ఉండేది. దీంతో బొగ్గు వినియోగాన్ని  ప్రభుత్వం నిషేధించింది. దీని స్థానంలో సహజ వాయువు లేదా హీటర్‌లతో భర్తీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత బీజింగ్‌లో పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. 2014లో మూతపడిన ఫ్యాక్టరీల సంఖ్య 392. ఈ కర్మాగారాల్లో సిమెంటు, బట్టలు మొదలుకొని రసాయనాల వరకు అన్నీ తయారయ్యేవి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!