Surya Mangal Transit: నవంబర్ 17 నుంచి సూర్య, కుజల సంచారం.. ఈ రాశివారిపై తీవ్ర ప్రభావం.. వ్యాపారస్తులకు నష్టాలు

మరో రెండు రోజుల్లో కుజుడు సూర్యుడు తమ గమనాన్ని మార్చుకుని మరో రాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నెల 16న కుజుడు, ఈ నెల 17న సూర్యుడు వృశ్చికరాశిలో సంచారం చేయనున్నారు. కుజ, సూర్య గ్రహాల సంచారంతో కొన్ని రాశులకు దుష్ప్రభావం కలిగితే మరికొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకుని వస్తాయి. ఈ గ్రహాల సంచారంతో కొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయి. అవి ఎలాంటి మార్పులో ఈ రోజు తెల్సుకుందాం 

Surya Mangal Transit:  నవంబర్ 17 నుంచి సూర్య, కుజల సంచారం.. ఈ రాశివారిపై తీవ్ర ప్రభావం.. వ్యాపారస్తులకు నష్టాలు
Surya Mangal Transit
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2023 | 8:34 AM

జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల సంచారం రాశులపై ప్రభావం చూస్తుంది. ఈ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టే సమయంలో కొన్ని రాశుల వారికీ శుభాలను.. మరికొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అశుభాలను కలుగజేస్తుంది. అయితే ఈ గ్రహాల సంచారం ప్రభావం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండదు. ఇలాంటి వారు తప్పనిసరిగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో కుజుడు సూర్యుడు తమ గమనాన్ని మార్చుకుని మరో రాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నెల 16న కుజుడు, ఈ నెల 17న సూర్యుడు వృశ్చికరాశిలో సంచారం చేయనున్నారు. కుజ, సూర్య గ్రహాల సంచారంతో కొన్ని రాశులకు దుష్ప్రభావం కలిగితే మరికొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకుని వస్తాయి. ఈ గ్రహాల సంచారంతో కొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయి. అవి ఎలాంటి మార్పులో ఈ రోజు తెల్సుకుందాం

మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల మనసు కలత చెందుతుంది. సహనం కోల్పోయే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అధిక కోపంతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉండవచ్చు. కనుక వీరు కోపాన్ని ఎంత నియంత్రించుకుంటే అంత మంచిది. అయితే వీరికి తమ జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్  లభిస్తుంది.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్య, కుజుల గ్రహాల సంచారంతో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఈ సమయంలో మానసిక సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. స్వీయ నియంత్రణ కోల్పోయి కోపం అధికం అవుతుంది. కొన్ని సందర్భాల్లో  ఇష్టమైన వాటిని కోల్పోయే అవకాశము ఉంది. అయితే స్నేహితుల అండ ఉంటుంది. ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్లే ఛాన్స్‌ ఉంది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: ఈ రాశికి చెందిన వారు ఈ గ్రహాల సంచారంతో ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎటువంటి పనులనైనా ఈజీ చేయగల సామర్ధ్యం లభిస్తుంది. పిల్లల వలన సంతోషం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు లభిస్తుంది. లాభాలను పొందే అవకాశం ఉంది. అయితే ఈ రాశికి చెందిన వారు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు కుజ, సూర్య గ్రహాల సంచారంతో ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఆర్ధిక లాభం కలుగుతుంది. ఆఫీసులో ఎటువంటి పనినైనా చేయగలరు. ఉద్యోగం మారె ఛాన్స్ ఉంది. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా కంప్లీస్ చేస్తారు.

సింహ రాశి: ఈ రాశి వారు మానసిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. అతిగా ఆలోచించడం మని.. పనులపై దృష్టిని పెట్టాలి. కళల పట్ల, సంగీతం పట్ల మక్కువ పెరుగుతుంది. చేసే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై ఈ గ్రహాల సంచారం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయి చిన్న చిన్న విషయాల పట్ల కూడా కలత చెందుతారు. వ్యాపారస్తులు, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. లేదంటే ఆర్ధికంగా నష్టాలు తప్పవు. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు