Israel Hamas War: మహిళా ఆర్మీయే కదా అని వాళ్లిచ్చిన సలహాను లైట్ తీసుకున్న ఇజ్రాయెల్ .. చివరకు హమాస్ విధ్వంసంతో..

అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం IDF కి చెందిన మహిళా యూనిట్‌కు గాజా పర్యవేక్షణ బాధ్యతను అప్పగించినట్లయితే.. ఇజ్రాయెల్‌పై  హమాస్ చేసిన దాడిని ఆపగలిగేవారమని ఘోరమైన దాడిని తప్పించేవారమని మహిళా సైనికులురాలు చెప్పింది. అయితే ఆ మహిళా సైనికురాలు తన పేరును వెల్లడించలేదు. అంతేకాదు ఇజ్రాయెల్ ఆర్మీలో ఉన్న లింగ వివక్షపై కూడా ఆరోపణలు చేసింది.

Israel Hamas War: మహిళా ఆర్మీయే కదా అని వాళ్లిచ్చిన సలహాను లైట్ తీసుకున్న ఇజ్రాయెల్ .. చివరకు హమాస్ విధ్వంసంతో..
Israel Hamas War
Follow us
Surya Kala

|

Updated on: Nov 21, 2023 | 9:23 PM

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది.. అనంతరం ఇజ్రాయెల్ గాజాలో విధ్వంసం సృష్టించింది. ఇరు దేశాల్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. వేల మంది జీవితాలు నాశనమయ్యాయి. ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. ఎందరో అమాయకులు అవయవాలు పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF)కి చెందిన ఒక మహిళా ఆర్మీ ఒక సంచలన విషయాన్నీ వెల్లడించింది. ఇప్పుడు ఆ సైనికురాలు చెప్పిన విషయం ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.

అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం IDF కి చెందిన మహిళా యూనిట్‌కు గాజా పర్యవేక్షణ బాధ్యతను అప్పగించినట్లయితే.. ఇజ్రాయెల్‌పై  హమాస్ చేసిన దాడిని ఆపగలిగేవారమని ఘోరమైన దాడిని తప్పించేవారమని మహిళా సైనికులురాలు చెప్పింది. అయితే ఆ మహిళా సైనికురాలు తన పేరును వెల్లడించలేదు. అంతేకాదు ఇజ్రాయెల్ ఆర్మీలో ఉన్న లింగ వివక్షపై కూడా ఆరోపణలు చేసింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ ఇటీవల చేస్తోన్న కార్యకలాపాలపై తమ ఉన్నతాధికారులను పలుమార్లు హెచ్చరించినట్లు ఆ  మహిళా సైనికురాలు పేర్కొంది.

తమ ఆర్మీ అధికారులను హెచ్చరించిన ఉమెన్ ఆర్మీ

ఏదో అసాధారణ ఘటన తమ దేశంలో జరగబోతోందని మహిళా నిఘా దళాలు హమాస్ ఉగ్రవాదుల    చొరబాటుకు నెలల ముందు చెప్పినట్లు మీడియా నివేదికలలో పేర్కొంది.  తమ దేశం సరిహద్దు కంచె దగ్గర ఉగ్రవాదులు బ్రీఫింగ్‌లు నిర్వహించడం, ట్యాంక్‌లపై దాడి చేయడంతో పాటు.. కెమెరాలను డిసేబుల్ చేయడంపై శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలతో పాటు తమ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాలను పెంచడం ఇజ్రాయెల్ కు చెందిన మహిళ సైనికులు గమనించారు. ఇదే విషయాన్నీ తమ ఉన్నతాధికారులకు చెప్పారు కూడా..

ఇవి కూడా చదవండి

తమ యూనిట్ పూర్తిగా యువతులు, యువ మహిళా కమాండర్లతో రూపొందించబడిందని మహిళా సైనికురాలు పేర్కొంది. అయితే సైన్యంలో పురుషుల విషయంలో భిన్నంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.  హమాస్ దాడి చేసిన రోజున.. ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తారని ఎవరూ ఊహించలేదు. క్షణాల్లో జరిగిపోయిందని.. ఇది గుర్తించి IDF ప్రతి దాడి చేయడానికి సమయం పట్టిందని వెల్లడించింది.

46 రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం

46 రోజుల తర్వాత గాజా యుద్దభూమిలో హమాస్ కొత్త యుద్ధ ప్రణాళికతో IDF షాక్ ఇచ్చింది. హిజ్బుల్లా, హౌతీ,  ఇరాకీ మిలీషియా గ్రూపులు ఇప్పుడు IDFపై దాడి చేయడానికి .. ఇజ్రాయెల్ సైన్యం ద్రుష్టి మరల్చడానికి  తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పై ఖతార్, ఇరాన్, టర్కీ, యెమెన్,  లెబనాన్ కొత్త కుట్రలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరోవైపు మధ్యప్రాచ్యంలో చైనా, రష్యాల జోక్యం కూడా పెరుగుతోంది. అదే సమయంలో గాజాలో 13 వేల మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్‌కు చెందిన 1400 మంది మరణించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..