26 ఏళ్లుగా సముద్రంలో తేలియాడుతున్న సీసా.. లోపల కీలకమైన లేఖ.! ఏం రాశారంటే..

అయితే ఈ బాటిల్ నీటిలో ఎప్పటి నుంచి తేలుతుందో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్‌ అవుతారు.. మొత్తం 26 సంవత్సరాలుగా ఈ బాటిల్‌ సముద్రంలో తేలియాడుతూ వస్తున్నట్టుగా తెలిసింది.. అవును, మీరు చదివింది నిజమే 26 సంవత్సరాల క్రితం ఎవరో ఈ సీసాలో ఒక లేఖను ఉంచి నీటిలో విసిరేసినట్టుగా తెలిసింది. ఆ పిల్లలు చేసిన ప్రయత్నం విజయవంతం అయిందని చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

26 ఏళ్లుగా సముద్రంలో తేలియాడుతున్న సీసా.. లోపల కీలకమైన లేఖ.! ఏం రాశారంటే..
Message In A Bottle
Follow us

|

Updated on: Nov 21, 2023 | 7:03 PM

చాలా సార్లు ప్రపంచానికి దూరంగా సముద్రపు ఒడ్డున దశాబ్దాల నాటి వస్తువులు, జ్ఞాపకాలు, గుర్తులు బయటపడుతూ.. ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇటీవల ఫ్రాన్స్‌లోని ఓ వ్యక్తి సముద్ర తీరంలో ఓ బాటిల్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. ఫ్రాన్స్‌లోని పశ్చిమ తీరంలో అతడు చూసింది ఒక సీసా మాత్రమే అయినప్పటికీ, దానిలో ఒక లేఖ కూడా ఉంది. అయితే ఈ బాటిల్ నీటిలో ఎప్పటి నుంచి తేలుతుందో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్‌ అవుతారు.. మొత్తం 26 సంవత్సరాలుగా ఈ బాటిల్‌ సముద్రంలో తేలియాడుతూ వస్తున్నట్టుగా తెలిసింది.. అవును, మీరు చదివింది నిజమే 26 సంవత్సరాల క్రితం ఎవరో ఈ సీసాలో ఒక లేఖను ఉంచి నీటిలో విసిరేసినట్టుగా తెలిసింది. వివరాల్లోకి వెళితే..

ఈ లేఖను 1997లో మసాచుసెట్స్‌లోని ఓ స్కూల్‌లో 5వ తరగతి పిల్లలు రాశారని తెలిసింది. ఇది బెంజమిన్ లియోన్స్చే వ్రాయబడింది. అతను, అతని సహచరుల పేర్లను ఈ ఉత్తరంలో రాశాడు. లేఖ ప్రకారం, వారి ఉపాధ్యాయుడు ఫ్రెడరిక్ హెమిలా నేతృత్వంలోని సముద్ర ప్రవాహాలపై సైన్స్ యూనిట్‌లో భాగంగా ఇది ఈ లేఖను సీసాలో ఉంచి సముద్రంలో విసిరేసినట్టుగా వివరించారు. లేఖ ఆధారంగా ఆ వ్యక్తి సంబంధిత వ్యక్తుల కోసం ఆరా తీశాడు..కానీ, ఫ్రెడరిక్ హేమిలాను కలవలేకపోయాడు.. కానీ, వారితో కలిసి పని చేసిన సహోద్యోగి కరోల్ ఆర్కేంబెల్ట్‌ని సంప్రదించగా..1997 సంవత్సరంలో ఫ్రెడరిక్ విద్యార్థులు ఈ లేఖను నీటి ప్రవాహం ఎంత దూరం తీసుకువెళుతుందో చూసేందుకు ప్రయత్నించారని చెప్పారు.

ఇంకా ఆ లేఖలో పిల్లలు ఇలా వ్రాశారు- ‘డియర్ బీచ్ కోంబర్..ఈ బాటిల్‌ని తీసుకున్నందుకు ధన్యవాదాలు. మాకు క్లాసులో ఓషన్ కరెంట్ నేర్పిస్తున్నారు. మా ప్రయత్నం సక్సెస్‌ అయితే.. మీకు మా బాటిల్‌ దొరికినట్టయితే..మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు. – మీకు ఈ బాటిల్ ఎక్కడ లభించింది. బాటిల్‌ ఏ స్థితిలో ఉంది? సీసా చుట్టూ నీళ్లు, రాళ్ళు తప్ప మరేదైనా ఉందా? నీకెలా వచ్చింది? అనే ప్రశ్నలు వేశారు.

ఇవి కూడా చదవండి

లేఖ రచయిత బెంజమిన్ లియోన్స్‌ను సంప్రదించడానికి ప్రయత్నించిన స్థానిక మీడియా సంస్థకు ఆ అవకాశం లభించలేదని తెలిసింది. కానీ, ఈ బాటిల్‌ నీళ్లలో విసిరిన విద్యార్థులు మాత్రం బాటిల్‌ను చాలా జాగ్రత్తగా వదిలిపెట్టారని ప్రకటించారు. అందుకే ఇంకా బాగానే ఉంది. లోపలకి నీళ్లు పోలేదన్నారు. ఆ పిల్లలు చేసిన ప్రయత్నం విజయవంతం అయిందని చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..