Stomach cancer: మీరు తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారా? ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి…

పొట్ట పై భాగంలో అసౌకర్యంగా ఇబ్బంది పడుతున్నా, లేదంటే నొప్పితో బాధపడాల్సి వచ్చినా కూడా అది కడుపు క్యాన్సర్‌ ప్రారంభాన్ని సూచిస్తుంది. బలహీనంగా, అలసటగా, నిరసించి పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండటం, అల్సర్ వంటి రుగ్మతలు ఎదురవుతాయి. అలాగే ఉబ్బరం, స్థిరమైన ఆమ్లత్వం, అజీర్ణం, గుండెల్లో మంట, కడుపు నొప్పి, వాంతులు, ఆహారం మింగడంలో ఇబ్బంది, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, అలసట, పొత్తికడుపు వాపు వంటి లక్షణాలను గమనించినట్టయితే..

Stomach cancer: మీరు తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారా? ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి...
Stomach Cancer
Follow us

|

Updated on: Nov 21, 2023 | 5:34 PM

కడుపు క్యాన్సర్ అనేది కడుపు లోపలి కణాలు అసాధారణంగా పెరిగినప్పుడు వస్తుంది. కడుపులోని కణాలు నియంత్రణ లేకుండా పెరగడం ప్రారంభించడాన్ని కడుపు క్యాన్సర్ అంటారు. ఇది శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. మారిన జీవనశైలి, ఆహారం గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను ప్రభావితం చేసే కారకాలు. తరచుగా ఈ క్యాన్సర్ చివరి దశలోనే నిర్ధారణ అవుతుంది. నిరంతర కడుపు నొప్పి కడుపు క్యాన్సర్‌కు ముఖ్యమైన హెచ్చరిక సంకేతం. ఇది తరచుగా అజీర్ణం అని తప్పుగా భావిస్తుంటారు. ఎగువ పొత్తికడుపులో తరచూ నొప్పిని భరిస్తున్నట్టయితే.. కడుపు క్యాన్సర్ ప్రారంభ సూచికగా భావించాలి. అలాగే, తిన్న తర్వాత కడుపు పైభాగంలో స్టెర్నమ్‌కు దిగువన పూర్తిగా నిండిన అనుభూతి, స్థిరమైన ఆమ్లత్వం, వాంతులు కూడా కడుపు క్యాన్సర్‌కు సంకేతం.

ఈ కడుపు క్యాన్సర్ ముఖ్యంగా మహిళల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. కడుపు క్యాన్సర్ వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆహారం మింగడంలో ఇబ్బంది. ఈ పరిస్థితిని డైస్ఫాగియా అని పేర్కొంటారు. తరచూ అస్వస్థతకు గురికావడం వంటి సమస్యలు వస్తాయి. అజీర్ణం, కడుపులో మంట, భోజనం తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి వంటి సంకేతాలు తలెత్తుతాయి. ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం

పొట్ట పై భాగంలో అసౌకర్యంగా ఇబ్బంది పడుతున్నా, లేదంటే నొప్పితో బాధపడాల్సి వచ్చినా కూడా అది కడుపు క్యాన్సర్‌ ప్రారంభాన్ని సూచిస్తుంది. బలహీనంగా, అలసటగా, నిరసించి పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండటం, అల్సర్ వంటి రుగ్మతలు ఎదురవుతాయి. అలాగే ఉబ్బరం, స్థిరమైన ఆమ్లత్వం, అజీర్ణం, గుండెల్లో మంట, కడుపు నొప్పి, వాంతులు, ఆహారం మింగడంలో ఇబ్బంది, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, అలసట, పొత్తికడుపు వాపు వంటి లక్షణాలను గమనించినట్టయితే.. వెంటనే వైద్యులను సంప్రదించి సూచించిన టెస్టులు చేయించుకోవటం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

కడుపు క్యాన్సర్‌కు కారణంగా మారే ఉప్పు, కారం ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి. ఫ్రైలు, మాంసాహారం తక్కువగా తినాలి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మద్యం తాగడం తగ్గించాలి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది కడుపు క్యాన్సర్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త